చుట్టాలబ్బాయి ఆడియో తేదీ ఖరారు

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన చుట్టాల‌బ్బాయి టీజ‌ర్ కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.ఈ టీజ‌ర్ ల‌క్ష వ్యూస్ కి రీచ్ అవ్వ‌డంతో హీరో ఆది త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. త‌మ‌న్ సంగీతం అందించిన చుట్టాల‌బ్బాయి ఆడియోను జులై 16న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. సెంటిమెంట్ - ఎంట‌ర్ టైన్మెంట్ మిక్స్ చేసి రూపొందించిన చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని జులై నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు.