చుట్టాలబ్బాయి టీజర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాలబ్బాయి. ఈ చిత్రంలో ఆది సరసన నమిత, యామిని హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు జాన్ కొక్కేన్ విలన్ గా నటించారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న చుట్టాలబ్బాయి చిత్రం టీజర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ...నిర్మాణ రంగంలో ప్రవేశించి మేము నిర్మించిన తొలి చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేలా ఈ చిత్రం ఉంటుంది. ఎక్కడా బోర్ అనేదే ఉండదు. ఆలీ, పృథ్వీ ల కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జులై సెకండ్ వీక్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
నిర్మాత రామ్ మాట్లాడుతూ...డైరెక్టర్ వీరభద్రమ్ సంవత్సరం క్రితమే కథ చెప్పారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
డైరెక్టర్ వీరభద్రమ్ మాట్లాడుతూ....మా నిర్మాతలు వెంకట్, రామ్ ఇద్దరూ నాతో సినిమా చేద్దాం అని వచ్చారు. ఇద్దరితో రెండు సినిమాలు చేసే కన్నా...ఇద్దరిని కలిపి మంచి సినిమా చేద్దాం అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం చేసాను. కష్టపడి కాకుండా ఇష్టపడి ఈ సినిమాని చేసాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాల వలే చుట్టాలబ్బాయి కూడా సూపర్ హిట్ అవుతుంది. ఆడియోను జులై 6న రిలీజ్ చేయనున్నాం అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ...మా డైరెక్టర్ వీరభద్రమే నా దగ్గరకి డైమండ్స్ లాంటి ఇద్దరు నిర్మాతలను తీసుకువచ్చాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ అనే పాయింట్ పై ఈ సినిమా కథ ఉంటుంది. అరుణ్ గారి కెమెరా వర్క్ ఈ సినిమాకి మరింత రిచ్ నెస్ తీసుకువచ్చింది. తమన్ మంచి ఆడియో అందించాడు. చుట్టాలబ్బాయి అందర్నీ ఆకట్టుకుని పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com