మే లో చుట్టాలబ్బాయి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాలబ్బాయి. ఈ చిత్రంలో ఆది సరసన నమిత, యామిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు జాన్ కొక్కేన్ విలన్ గా నటిస్తున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సెంటిమెంట్ - ఎంటర్ టైన్మెంట్ సమపాళ్లలో ఉండే ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు చిత్రయూనిట్. చుట్టాలబ్బాయి ఆడియోను మే నెలాఖరున రిలీజ్ చేసి.. ఈ మూవీని జూన్ మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో ఆది - డైరెక్టర్ వీరభద్రమ్ ఇద్దరికీ విజయం కావాలి. మరి..చుట్టాలబ్బాయి వీరిద్దరికీ ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments