జూలై 22న 'చుట్టాలబ్బాయి'
Sunday, July 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా రీరికార్డింగ్ జరుగుతోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను జూలై 16న, చిత్రాన్ని జూలై 22న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన టీజర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. వీరభద్రమ్‌గారు ఈ చిత్రాన్ని చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఆది పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి థమన్‌గారు సూపర్‌హిట్ మ్యూజిక్‌ని చేశారు. ఈ ఆడియోను జూలై 16న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే చిత్రాన్ని జూలై 22న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - ''ఒక మంచి కథని కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆనందించేలా రూపొందించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నేను అనుకున్నట్టుగా తీయడంలో నిర్మాతల సహకారం ఎంతో వుంది. బడ్జెట్‌కి వెనకాడకుండా అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ చిత్రానికి థమన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ చేశారు. ఈ సినిమాకి పాటలు చాలా పెద్ద హైలైట్ అవుతాయి. నాకు, ఆదికి ఈ సినిమా మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments