చుట్టాలబ్బాయిని ప్రేక్షకులు తమ సొంతం చేసుకున్నారు - దర్శకుడు వీరభద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని ఈ విజయంతో తామెంతో పొంగి పోతున్నామని యూనిట్ సభ్యులు అన్నారు. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా...
దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకు పోయింది. ఇప్పుడు ప్రేక్షకులు మా చుట్టాలబ్బాయిని తమ సొంతం చేసుకున్నారు. తిరుపతిలో థియేటర్ కి వెళ్ళినప్పుడు హౌస్ ఫుల్ అవటంతో పాటు జనం కేరింతలు చప్పట్లతో ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారని అది చూసిన తర్వాత అంతవరకు నాలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా పోయిందన్నారు. తిరుపతి నుండి బయలుదేరిన మా యూనిట్ విజయ యాత్ర రాజంపేట, కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, విజయనగరం వరకు జరిగింది. కొన్ని థియేటర్ ల వద్ద తాము కారుల్లోంచి దిగాలేనంత అభిమానాన్ని ప్రదర్శించారని, దాంతో మా ఆనందం రెట్టింపు అయిందన్నారు. అహ నా పెళ్ళంట, పూలరంగడు తరువాత ఎంతటి ఆనందం పొందానో చుట్టాలబ్బాయితో రెట్టింపు ఆనందాన్ని పొందాను. సాయి కుమార్, ఆది కలిసి నటించటం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచిందన్నారు. మా విజయ యాత్రలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న సందర్భంలో కూడా చుట్టాలబ్బాయి, చుట్టాలబ్బాయి అని జనంలోంచి జనంలోంచి కేకలు రావటం, అలాగే వైజాగ్ లోని వివి వినాయక్ గారి థియేటర్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనే స్వయంగా ఫోన్ చేసి అభినందించటం మరింత సంతోషం కలిగించిందన్నారు.
నిర్మాతలు రాం వెంకట్ మాట్లాడుతూ విజయ పథాన దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. తొలి చిత్రంతోనే విజయాన్ని పొందటం మూడో వారంలో కూడా కలెక్షన్స్ రావటం తాము ఊహించలేదన్నారు. మరిన్ని క్వాలిటీ చిత్రాలను నిర్మించేందుకు మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
సాయికుమార్ మాట్లాడుతూ తండ్రీ కొడుకులం కలిసి నటించాలనే మా కోరికను నిజం చేసిన దర్శకుడు వీరభద్రంకు ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు నిర్మాతలకు యూనిట్ సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నో విజయయాత్రలలో పాల్గొన్నప్పటికీ ఆదితో కలిసి తొలిసారిగా విజయయాత్రలో పాల్గొనటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గరం` చిత్రం చేసేటప్పుడు ఆది తో పక్కింటబ్బాయి పేరుతొ చిత్రం చేద్దామనుకున్నాను. కాని వీరభద్రం చుట్టాలబ్బాయి చేస్తాననగానే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఎదో ఒక రోజు ఆదితో పక్కింటబ్బాయి చిత్రం కూడా తీస్తానని తెలిపారు. ప్రేమ కావాలి, లవ్లీ తరువాత ఆది కెరీర్ లో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ టైటిల్ కాచీగా ఉంది. ఫాస్ట్ గా జనంలోకి వెళ్ళిపోయింది. విజయ యాత్ర సమయంలోనే ప్రేక్షకుల రెస్పాన్స్ ను స్వయంగా చూసిన అనుభూతి మిగిలింది. లీడింగ్ థియేటర్స్ లో వెయ్యటం వల్ల మూడో వారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి అన్నారు.
బి ఏ రాజు మాట్లాడుతూ ప్లాటినం డిస్క్ జరుపుకోవటం చిత్రానికి, చిత్రంలోని పాటలకు లభించిన ఆదరణకు నిదర్శనంగా భావించాలి. ఈ సినిమాతో వీరభద్రం మరో హిట్ కొట్టారు. హీరోగా ఆది మరింత పెద్ద రేంజ్ కు వెళ్ళారని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన తమన్ కే ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఈ సక్సెస్ ను డిస్ట్రిబ్యూటర్ గా బాగా ఎంజాయ్ చేస్తున్నానని మొదట్లో తక్కువ థియేటర్లు వేసినా తరువాత థియేటర్ల సంఖ్య పెరిగిందని ఆది కెరీర్ కు ఇదో మలుపుగా భావిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు భద్రం, చమ్మక్ చంద్ర, రైటర్ భావాన్ని, కెమెరామెన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments