బ్యాంకాక్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'
Send us your feedback to audioarticles@vaarta.com
లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ జనవరి 29 నుంచి బ్యాంకాక్‌లో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్ తలారి మాట్లాడుతూ - ''జనవరి 29 నుంచి బ్యాంకాక్‌లో స్టార్ట్ చేస్తున్న తాజా షెడ్యూల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ని శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించడం జరుగుతుంది. పాటతోపాటు కొన్ని సీన్స్‌ని కూడా షూట్ చెయ్యబోతున్నాం. దీని తర్వాత ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ వుంటుంది. మార్చి 2 నుంచి 20 రోజులపాటు రాజమండ్రిలో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది'' అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - ''మా 'చుట్టాలబ్బాయి' ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిపోయింది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్ చాలా ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
లవ్లీ రాక్‌స్టార్ ఆది, నమిత ప్రమోద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, అభిమన్యు సింగ్, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్, స్టిల్స్: గుణకర్, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments