చుట్టాలబ్బాయి సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Friday,August 05 2016]

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ తాల్లూరి, వెంక‌ట్ త‌లారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు చుట్టాల‌బ్బాయి సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ చుట్టాల‌బ్బాయి చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 19న రిలీజ్ చేయ‌డానికి చిత్ర నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. ఆది, సాయికుమార్ ఫ‌స్ట్ టైమ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన చుట్టాల‌బ్బాయి చిత్రం హీరో ఆది, డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ కెరీర్ లో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలుస్తుంద‌ని చిత్ర‌యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు చుట్టాల్బాయి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

More News

బ‌న్ని మ‌ళ్లీ ఆ భామ‌కే ఛాన్స్ ఇచ్చాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు సినిమాతో రీసెంట్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత బ‌న్ని హ‌రీష్ శంక‌ర్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.

మ‌న‌మంతా గురించి రాజ‌మౌళి రివ్యూ..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి రూపొందించిన చిత్ర‌ మ‌న‌మంతా.  ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.

'బాబు బంగారం' సెన్సార్ పూర్తి...

విక్టరీ వెంకటేష్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ఎస్.నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'.

వెంకటేష్ - నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్లో మూవీ డీటైల్స్..

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ..హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

వరుణ్ తేజ్ ఫిదా ప్రారంభమైంది...

వరుణ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఫిదా.