ఆ రోజే...చుట్టాల‌బ్బాయి కూడా వ‌స్తున్నాడు

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్, వెంక‌ట్ త‌లారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించిన చుట్టాల‌బ్బాయి ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఇక మూవీ రిలీజ్ విష‌యానికి వ‌స్తే...ఈ రోజుతో చుట్టాల‌బ్బాయి షూటింగ్ పూర్త‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా పూర్తి చేసి చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...ఆగ‌ష్టు 5న అల్లు శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, మోహ‌న్ లాల్ మ‌న‌మంతా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల‌తో పాటు చుట్టాల‌బ్బాయి కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తాడో...లేక కొంత గ్యాప్ తీసుకుని వ‌స్తాడో అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

మహేష్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం తర్వాత మహేష్ నెక్ట్స్ మూవీ ఏమిటి అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉండేది.

కబాలి మేకింగ్ రాకింగ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది.కబాలి తెర పైకి రావడానికి ఇక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది.

బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు - అల్లు శిరీష్

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

అందుకు డిస్ట్రిబ్యూట‌ర్స్ ముందుకు రావ‌డం లేదు

సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అటువంటిది సూప‌ర్‌స్టార ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఎంత ఆస‌క్తిని ప్ర‌ద‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఈ రెండింటిలో సూర్య దేనికి ఓటేస్తాడో

సింగం3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న హీరో సూర్య నెక్ట్స్ సినిమాను క‌బాలి ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌నేది అన‌ధికార స‌మాచారం.