చాగల్లు లో చుట్టాలబ్బాయి...

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

ఆది, న‌మిత ప్ర‌మోద్ జంట‌గా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి తెర‌కెక్కిస్తున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రం ప్ర‌స్తుతం పశ్చిమ గోదావ‌రి జిల్లా చాగ‌ల్లు రైల్వేస్టేష‌న్ స‌మీపంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
చాగ‌ల్లు రైల్వే స్టేష‌న్ స‌మీపంలో హీరో ఆది, హీరోయిన్ న‌మిత ప్ర‌మోద్, విల‌న్ చ‌ర‌ణ్ దీప్ ల‌పై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ నెల 20 వ‌ర‌కు రాజ‌మండ్రి స‌మీపంలో షూటింగ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, పృథ్వీ, జీవా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.