ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చుట్టాలబ్బాయి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది, నమిత, యామిని హీరో, హీరోయిన్లుగా వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాలబ్బాయి. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో హీరో ఆది మాట్లాడుతూ...ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథను తీసుకుని ఏమాత్రం ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా డైరెక్టర్ వీరభధ్రమ్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ చెప్పిన దానికన్నా చాలా బాగా ఈ సినిమాని తీస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ వీరభధ్రమ్ మాట్లాడుతూ...రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. సినిమా బాగా వస్తుంది అన్నారు.
నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ...హీరో ఆది ఇంట్రడక్షన్ సాంగ్ ను బ్యాంకాక్ లో చిత్రీకరించాం. మిగిలిన పాటలను చిత్రీకరించాలి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, హీరోయిన్స్ నమిత, యామిని మాట్లాడుతూ...సెంటిమెంట్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.థమన్, కెమెరామెన్ నాగేంద్ర, ఆర్ట్ ఎస్ శేఖర్, నిర్మాత వెంకట్ తలారి, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం - వీరభధ్రమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com