జీ 5లో ‘చుప్:  రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ చిత్రం 24 గంటల్లో 30 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్

మన ఇండియాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగానికి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఈ రంగంలో చాలా మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఓటీటీ ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు చాలా చేరువయ్యాయి. ఈ ఓటీటీ మాధ్య‌మాల్లో వేగంగా అభివృద్ధి అవుతూ నెంబ‌ర్ 1 వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా ఎదుగుతున్న సంస్థ జీ 5. ఇందులో నవంబ‌ర్ 25 నుంచి ‘చుప్‌: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ అవుతుంది.

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ గ‌డా, గౌరి షిండే, రాకేష్ జున్‌జున్‌వాలా, హోప్ ప్రొడ‌క్ష‌న్స్ అనీల్ నాయుడు నిర్మించిన‌ ఈ చిత్రాన్ని ఆర్‌.బాల్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్నీడియోల్‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, శ్రేయా ధ‌న్వంత‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్రీమియ‌ర్ అవుతుంది. పూజా భ‌ట్‌, శ‌ర‌ణ్య పొన్‌వ‌నన్ స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రత్యేక పాత్ర‌లో న‌టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. థియేట‌ర్స్‌లో స‌క్సెస్ అయిన త‌ర్వాత జీ 5లో ఆడియెన్స్‌ని అలరిస్తోంది చుప్ చిత్రం. 24 గంట‌ల్లో 30 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టుకోవ‌ట‌మే అందుకు సాక్ష్యం.

గురుద‌త్‌కి నివాళిగా రూపొందించిన ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే మూవీ సినిమా విమర్శకులను లక్ష్యంగా చేసుకున్న సైకోపాత్ కిల్లర్ కథాంశమే ఇది. సినీ విమర్శకుల నైతికతపై అనేక ప్రశ్నలను సంధించే థ్రిల్లర్ చిత్రమిది. కొందరి వ్యక్తుల అభిప్రాయాలపై యాక్టర్ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? మరోవైపు, కళ విమర్శించబడకుండా ఉనికిలో మరియు అభివృద్ధి చెందుతుందా? ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్ట్‌’ సినిమాలో నటీనటుల గొప్ప ప్రదర్శనలు, సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక అంశాలు ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది.

అమిత్ త్రివేది, స్నేహా ఖాన్ వాల్కర్ అద్భుత‌మై ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌లో వినిపించే SD బర్మన్ పాటలతో ఉన్న ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మీడియా మరో కోణాన్ని ప్రపంచానికి వివరించింది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 25 నుంచి జీ 5లో ప్ర‌సారం అవుతుంది. 190 దేశాల‌కు పైగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం.. 5 భాష‌ల్లో ఈ సినిమా జీ 5లో అందుబాటులో ఉంటుంది. ప్రేక్ష‌కులు మాతృక‌ను స‌బ్ టైటిల్స్‌తో చూడాల‌నుకునేవారు కూడా చూడొచ్చు. కావున ఈ మిస్టీరియ‌స్ డార్క్ థ్రిల్ల‌ర్‌ను జీ 5లో చూడాల‌నుకునేవారు జీ 5లో వీక్షించ‌వ‌చ్చు.

జీ 5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘మా జీ5లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కొత్త‌గా, డిఫ‌రెంట్ చూపించాల‌నుకుంటుంటాం. అందులో భాగంగా ‘చుప్: రివేంజ్ ఆప్ ది ఆర్టిస్ట్‌’లో అద్భుతమైన నటీనటులున్నారు. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కింది. దీన్ని థియేటర్స్‌లో చూసే అవ‌కాశం లేదు. జీ5లో మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు. సాధార‌ణంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫ్లాట్ ఫామ్స్‌లో చ‌క్క‌టి ఆద‌ర‌ణ‌ను పొందుతాయి. ఆ కోవ‌లో ఇ్ప‌పుడు చుప్ సినిమా చేరింది. ఇలాంటి మంచి సినిమాను నిర్మించిన నిర్మాత‌ల‌తో మేం భాగ‌స్వామిగా మారినందుకు చాలా సంతోషంగా ఉన్నాం’’ అన్నారు.

పెన్ స్టూడియోస్ చైర్మ‌న్‌, ఎం.డి డా.జ‌యంతి లాల్ గ‌డ మాట్లాడుతూ ‘‘ఆర్‌.బాల్కిగారు తెర‌కెక్కించే సినిమాలు యూనిక్‌గా ఉంటాయి. ఇలాంటి టాలెంటెడ్ క్రియేట‌ర్స్‌తో మేం కావ‌టం చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ మూవీ నెరేష‌న్ చాలా ఎంగేజింగ్‌. ఇలాంటి సినిమాల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత‌గా ఉంది. అలాగే జీ 5 సంస్థ‌తో జ‌త క‌ట్ట‌టం మ‌రో సంతోష‌క‌ర‌మైన విష‌యం. ఎందుకంటే సినిమాకు గ్లోబెల రీచ్ ఉంటుంది. ప్రేక్ష‌కులు వారికి ఇష్ట‌మున్న భాష‌లో సినిమాను చూసే అవ‌కాశం ఉంటుంది’’ అన్నారు.

సన్నీ డియోల్ మాట్లాడుతూ ‘‘‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ లో ఐజీ అర‌వింద్ మాథుర్ పాత్ర‌లో న‌టించ‌టం ఓ టెరిఫిక్ ఎక్స్‌పీరియెన్స్‌. జిగ్ జాగ్ ప‌జిల్‌ను సాల్వ్ చేసే పాత్ర‌. సినిమా ఇప్పుడు జీ 5లో ఐదు భాష‌ల్లో అందుబాటులో ఉంది. సినిమాను త‌ప్ప‌కుండా చూడాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను. ఎందుకంటే ప్రేక్ష‌కులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు ..స‌స్పెన్స్‌తో సీట్ ఎడ్జ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది’’ అన్నారు.

దుల్క‌ర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘సీరియ‌ల్ కిల్ల‌ర్ డానీ వంటి ట్విస్టెడ్ సీరియ‌ల్ కిల్ల‌ర్ రోల్‌లో న‌టించటం ఓ ఎక్స్‌పెరిమెంట్‌. విమ‌ర్శ‌కుల‌ను హ‌త్య చేసే హంత‌కుడిని ఓ పెద్ద సిటీలో గుర్తించ‌టం అనే ఆలోచ‌నే చాలా భ‌యాన్ని క‌లిగిస్తుంది. చుప్ సినిమా క‌థ నెరేష‌న్ క్రిమిన‌ల్ ఎలా ఆలోచిస్తాడ‌నే విష‌యాల‌ను చూపిస్తుంది. దీని వ‌ల్ల ఆడియెన్స్ మాన‌సిక ప‌రిస్థితి, నైతిక‌త‌ను మూవీ ప్ర‌శ్నిస్తుంది. ఈ మూవీలో న‌టించిన న‌టీన‌టులు మీరు రెగ్యుల‌ర్‌గా చూసే డిటెక్టివ్ డ్రామాలో వారు కాదు. సినిమా చూస్తున్నంత సేపు మీ గుండె వేగం పెరుగుతుంది. దీని వల్ల సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయి ’’ అన్నారు.

శ్రేయా ధన్వంతరి మాట్లాడుతూ ‘‘‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ ఒక ల‌వ్ స్టోరి. సినిమాపై ఉండే ప్రేమ‌ను తెలియ‌జేస్తుంది. ర‌క్తంతో నిండిన ప్ర‌పంచంలో ఒక‌రినొక‌రు అన్వేషించుకునే ప్రేమికుల క‌థే ఇది. గురుద‌త్‌గారి ప్రేమ క‌థ‌లాంటిది. హత్య‌లోనూ క‌ళ‌ను వెతుక్కునే ప్రేమ‌క‌థ‌. ఉత్కంఠిత‌న భ‌రిత‌మైన ఘ‌ట‌న‌లు, ట్విస్టులు, ట‌ర్నులు చూస్తుంటే క్లైమాక్స్ ఎప్పుడు వ‌స్తుందా అనే ఆస‌క్తి పెరిగిపోతుంది. నిలా అనే పాత్ర‌ను పోషించాను. మూవీ క్రిటిక్ కావాల‌నుకునే వ్య‌క్తి పాత్ర నాది. ఈ ఆలోచ‌న కొత్త‌గా ఉంది. ఆ పాత్ర గురించి చెప్ప‌గానే నాలాగే సినిమా గురించి సినిమాను ప్రేమించే పాత్ర అని అర్థ‌మైంది. యాక్ట‌ర్స్ ఓ సినిమాను చేసిన‌ప్పుడు దాన్నెలా చేశార‌నే విష‌యాన్ని సినీ విమ‌ర్శ‌కులే చెబుతారు. కానీ ఆ విష‌యాల‌కు మ‌రో కోణాన్ని చూపే అవ‌కాశం అరుదుగా వ‌స్తుంటుంది. స్క్రీన్‌పై నిలా పాత్ర‌లో న‌టించటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

చుప్ అనేది సున్నితమైన కళాకారుడికి సంకేతం. గురుదత్ ఆ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు. చాలా కాలంగా ఈ నా దగ్గర కథ ఉంది, చివరకు రాశాను.. సినిమాగా రూపొందించాను అని సంతోషిస్తున్నాను. కాగ‌జ్ కా పూల్ వంటి గొప్ప సినిమాను తెర‌కెక్కించిన గురు ద‌త్ కూడా చాలా భారీగానే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమా చేయ‌లేదు. క‌ళాకారుడుని క‌ళ‌కు దూరం చేస్తున్న‌ప్పుడు ఎంతో కుంగిపోతారు. కొంద‌రు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. అటువంటి విమర్శల పట్ల కళాకారుడి రియాక్ష‌న్‌లోని లోపాన్ని పరిశీలించే క‌థే చుప్‌. ప‌వ‌ర్ వ‌ల్ల వ‌చ్చే బాధ్య‌త‌ల‌ను త‌ప్పుగా ఉప‌యోగించినప్పుడు క‌లిగే ప్ర‌మాదక‌ర‌మైన ప‌రిణామాల‌ను ఆవిష్క‌రించే చిత్ర‌మిది.

న‌వంబ‌ర్ 25నుంచి ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ జీ 5లో ప్రీమియ‌ర్ అవుతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.