చిలుకూరి బాలాజీ తొలి కాపీ సిద్దం
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో ఈ టివితో కలిసి ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిలుకూరి బాలాజీ సినిమా ఇటీవలే సీజీ వర్క్ పూర్తి చేసుకుంది. త్వరలో తొలికాపీ రానుంది. అనంతరం ఆడియోను విడుదల చేసి వెంటనే సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలిపారు.
వీసా బాలాజీ గా పేరు గాంచి యువతరం చే నిత్యము పూజలు అందుకుంటున్న చిలుకూరి బాలాజీ చరిత్రను సాయికుమార్, బాలసుబ్రహ్మణ్యం,సుమన్,ఆమని లాంటి సీనియర్ నటీనటులతో రూపొందించాము. ఈ సినిమాకు సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల లాంటి సాహిత్య కారులు ఈ సినిమాకు సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాను చూసిన చిలుకూరి బాలాజీ కోవెల ప్రధాన అర్చకులు సౌందరాజన్ గారు ఈ సినిమాను చూసి ప్రశంసించారు.
ఈ సినిమా ఒక అన్నమయ్య, ఒక రామదాస్ ల్లా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ దేశ విదేశాల్లో విపరీతంగా విపరీతంగా ఆదరణ పొందాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని జనం ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి చిలుకూరుకు ఎందుకు వచ్చాడు... ఎలా వెలిశాడు అనేదాన్ని ఈ సినిమాలో చూపించాము.
ఈ సినిమాలోని చివరి పాటలో సిజివర్క్ ఎక్కువగా ఉండటం వలన దాన్ని పూర్తి చేయడానికి కాస్త సమయం పట్టింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు జీవం పోశారు. తప్పకుండా ఈ సినిమా మా బేనర్ కు మరింత మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం మాకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments