మహేష్ ఇంట్లో మొదలైన క్రిస్మస్ సంబరాలు..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్..ఎంత బిజీగా ఉన్నా...ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. సమ్మర్ కి, ఫెస్టివల్స్ కి టూర్స్ ప్లాన్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్తుతం మహేష్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 23 వరకు ఈ చిత్రం అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
తర్వాత మహేష్ పిల్లలతో కలిసి క్రిస్మస్ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అయితే...మహేష్ పిల్లలు గౌతమ్, సితార మాత్రం అప్పుడే క్రిస్మస్ సంబరాలు మొదలెట్టేసారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ...అన్నాచెల్లెల్లు (గౌతమ్, సితార) ఒకే రకమైన క్రిస్మస్ కళ్లజోడు పెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసి క్రిస్మస్ సంబరాలు అప్పుడే మొదలై పోయాయి అని తెలియచేసారు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments