క్రిస్మస్ క్యూ కడుతున్న సినిమాలు ఇవే..!
Send us your feedback to audioarticles@vaarta.com
దసరాకి ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నారు నిర్మాతలు. ఇంతకీ క్రిస్మస్ కి వచ్చే సినిమాలు ఏమిటంటే....మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లోకల్. ఈ చిత్రాన్నినక్కిన త్రినాథరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ధృవ, నేను లోకల్ తర్వాత క్రిస్మస్ కి వస్తున్న చిత్రం వెంకటేష్ గురు. బాలీవుడ్ మూవీ సాలా ఖుద్దూస్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి డిసెంబర్ రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న రోగ్ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments