క్రిస్మస్ క్యూ క‌డుతున్న సినిమాలు ఇవే..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

ద‌స‌రాకి ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీప‌డుతున్నారు నిర్మాత‌లు. ఇంత‌కీ క్రిస్మ‌స్ కి వ‌చ్చే సినిమాలు ఏమిటంటే....మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ధృవ‌. సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే నాని - కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్నిన‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ధృవ‌, నేను లోక‌ల్ త‌ర్వాత క్రిస్మ‌స్ కి వ‌స్తున్న చిత్రం వెంక‌టేష్ గురు. బాలీవుడ్ మూవీ సాలా ఖుద్దూస్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించి డిసెంబ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల‌తో పాటు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న రోగ్ చిత్రాన్ని కూడా డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

చైతు...రెండు సినిమాలు ఒకేసారి

అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమైయ్యాయి. ఇవి విడుదలక కాకమునుపే చైతన్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

టిప్పు మూడో ప్రయత్నం

`టిప్పు`, `పడేసావే` చిత్రాల హీరో కార్తీక్ రాజు ఇప్పుడు మరో సినిమా  చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి రెండు చిత్రాలతో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన ఈ యువ హీరో మూడోసారి ఓ లవ్ ఎంటర్ ను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ గారే - సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కి హీరోయిన్ దొరికేసింది..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథమ్. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హాట్ హాట్ గా శ్రీముఖి..!

యాంక‌ర్ ట‌ర్న‌డ్ ఏక్ట‌ర‌స్ శ్రీముఖి ప్ర‌స్తుతం టివీ షోస్ లో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు బుల్లితెర పై  షోస్ చేస్తూనే మ‌రో వైపు వెండితెర పై న‌టిస్తుంది. అయితే...వెండితెర పై ఓ వెలుగు వెల‌గాలి అంటే...ఏం చేయాలో తెలుసుకున్న‌ట్టుంది. వెరైటీగా బ్లాక్ & వైట్ లో హాట్ హాట్ స్టిల్స్ ను త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.