కరోనా బారినపడ్డ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. పరిస్థితి విషమం, సాయం కోసం కొడుకు విజ్ఞప్తి
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా కారణంగా ఎందరో సినీ నటీనటుడు, సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా పలువురు వైరస్ బారినపడుతున్నారు. నిన్న గాక మొన్న విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చిన ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్థారణ అయ్యింది. ఇక హిందీ టీవీ నటి మాధవి గోగటే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కూడా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని అంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయనకు కూడా సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాచారం.
ఇక శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే స్తోమత తమ వద్ద లేదని అంటున్నారు అజయ్ కృష్ణ. శివశంకర్ మాస్టర్ దక్షిణాదిలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్ కొరియోగ్రఫికి గాను ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout