Rakesh Master : టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇకలేరు. ఆయన వయసు 55 సంవత్సరాలు ఆదివారం విశాఖ నుంచి వస్తూ రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇదీ రాకేష్ మాస్టర్ ప్రస్థానం :
రాకేష్ మాస్టర్ పూర్తి పేరు ఎస్ రామారావు. 1968లో తిరుపతిలో పుట్టిన ఆయన సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చేశారు. అక్కడ ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు ఇలా 1500 చిత్రాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు . గత కొంకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు రాకేష్ శిష్యులే. వెండితెరతో పాటు బుల్లితెరపైనా రాకేష్ మాస్టర్ ప్రేక్షకులను అలరించారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా, డ్యాన్స్ షోలలో కుర్రాళ్లకు మాస్టర్‌గా ఆయన వ్యవహరించారు.
అయితే యూట్యూబ్‌లో పలువురు అగ్రహీరోలు, సినీ ప్రముఖులపై రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనితో పాటు శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవ సంఘాలు రెండేళ్ల క్రితం రాకేష్ మాస్టర్‌పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే రాకేష్ మాస్టర్‌కు మతిస్థిమితం లేకపోవడం వల్లనే ఇలా మాట్లాడుతున్నాడంటూ కొందరు కామెంట్ చేశారు కూడా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments