చైనాలో చిట్టి హంగామా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గ్రాఫికల్ వండర్ `2.0`. ఇదే కాంబినేషన్లో వచ్చిన `రోబో`కు సీక్వెల్ ఇది. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం గత ఏడాది నవంబర్‌లో సందడి చేసింది. ఇప్పుడు చైనాలో సందడికి సిద్ధమైంది. `బాలీవుడ్ రోబో 2.0 రిసెర్జన్స్` పేరుతో ఈ సినిమాను చైనాలో 56 వేల స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్ వై మీడియా ప్లాన్ చేస్తుంది. ఇందులో 47 వేల స్క్రీన్స్ త్రీడీలో.. 9 వేల స్క్రీన్స్ సాధారణ 2డీ స్క్రీన్స్. ఎమీజాక్సన్ లేడీ రోబోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పక్షిరాజుగా నటించాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించవచ్చునని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout