చైనాలో చిట్టి హంగామా
- IndiaGlitz, [Sunday,March 03 2019]
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గ్రాఫికల్ వండర్ '2.0'. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో'కు సీక్వెల్ ఇది. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం గత ఏడాది నవంబర్‌లో సందడి చేసింది. ఇప్పుడు చైనాలో సందడికి సిద్ధమైంది. 'బాలీవుడ్ రోబో 2.0 రిసెర్జన్స్' పేరుతో ఈ సినిమాను చైనాలో 56 వేల స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్ వై మీడియా ప్లాన్ చేస్తుంది. ఇందులో 47 వేల స్క్రీన్స్ త్రీడీలో.. 9 వేల స్క్రీన్స్ సాధారణ 2డీ స్క్రీన్స్. ఎమీజాక్సన్ లేడీ రోబోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పక్షిరాజుగా నటించాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించవచ్చునని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.