'చిత్రాంగద' హక్కులను దక్కించుకున్న....

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

వెంకట్‌ వాడపల్లి, టి.సి.యస్‌.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా బ్యానర్‌పై అంజలి, దీపక్‌, సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం చిత్రాంగద'. పిల్ల జమీందార్ ఫేమ్ జి.అశోక్‌ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు సిద్ధమైంది. హర్రర్‌ కామెడి జోనర్ గీతాంజ‌లి త‌ర్వాత అలాంటి జోన‌ర్‌లోనే అంజ‌లి న‌టించిన చిత్ర‌మిది. హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా కోసం అంజ‌లి 15-20 కిలోల బ‌రువు త‌గ్గ‌డం విశేషం. సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ అమెరికాలోనే జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు రానీ డిఫ‌రెంట్ పాయింట్ సినిమా అని అంజ‌లి సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమా హ‌క్కుల‌ను ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ సొంతం చేసుకుంది.