పాట మినహా అంజలి 'చిత్రాంగద' పూర్తి

  • IndiaGlitz, [Saturday,August 15 2015]

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఒక పాట మినహా షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అశోక్‌. జి తెలియజేస్తూ..'' గీతాంజలి తర్వాత అంజలికి పలు లేడీఓరియెంటెడ్‌ చిత్రాల ఆఫర్లు వచ్చినా..ఆమె అంగీకరించలేదు. మా కథ విన్న వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓ విభిన్నమైన కాన్సెఫ్ట్‌తో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న థ్రిల్లర్‌ హారర్‌ కామెడీ చిత్రమిది. కథ డిమాండ్‌ మేరకు అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లోని పలు అందమైన లోకేషన్లలో 80 శాతం షూటింగ్‌ జరిపాము. పలువురు హాలీవుడ్‌ టెక్నిషీయన్స్‌ కూడా ఈ చిత్రానికి పనిచేశారు. తప్పకుండా ఈ చిత్రం అంజలి కెరియర్‌లో కలకాలం గుర్తుండేలా ఉంటుంది..'' అన్నారు.

నిర్మాత గంగపట్నం శ్రీధర్‌ మాట్లాడుతూ..''గీతాంజలి తర్వాత అంజలికి పలు ఆఫర్లు వచ్చినా..దర్శకుడు అశోక్‌ చెప్పిన కథతో పాటు ఆయన ప్రతిభ మీద నమ్మకంతో అంజలి ఈ సినిమా అంగీకరించింది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అమెరికాతో పాటు, బెంగళూర్‌, వైజాగ్‌, హైదరాబాద్‌లలోని పలు లోకేషన్‌లలో చిత్రీకరణ జరిపాము. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది..'' అన్నారు.

అంజలి, సింధుతులానీ, సప్తగిరి, రక్ష, రాజారవీంద్ర, జ్యోతి, సాక్షిగులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్‌; ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి; కెమెరా: బాల్‌రెడ్డి; నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్‌.జి

More News

'కంచె' టీజర్ కు అద్భుత స్పందన

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '.

'బాహుబలి' పార్ట్ 2 కర్ణాటక హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘తుంగభద్ర’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయికొర్రపాటి.

'అబ్బాయితో అమ్మాయి' బిజినెస్ అదిరిందట..

ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది

'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ‘మిర్చి’ ఫేమ్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

'సైజ్ జీరో' ఆ చిత్రంలా ఉంటుందా...?

అనుష్క ప్రధానపాత్రలో ‘బాహుబలి’, ‘రుద్రమదే’వి చిత్రాల తర్వాత ‘ చేస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. పివిపి బ్యానర్ పై