ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ 'చిత్రాంగద' - అంజలి
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకట్ వాడపల్లి, టి.సి.యస్.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్‌పై అంజలి, దీపక్, సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం చిత్రాంగద`. పిల్ల జమీందార్ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోయిన్ అంజలి టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....
అంజలి మాట్లాడుతూ హర్రర్ కామెడి జోనర్ మూవీ అని చెప్పను కానీ డిఫరెంట్ జోనర్‌లో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కుతుంది. గీతాంజలి` తర్వాత నేను చేస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఇది. 80 శాతం సినిమాని అమెరికాలోనే చిత్రీకరించాం. పదిరోజు షూటింగ్, పాటు మినహా సినిమా పూర్తయింది. సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా సూపర్‌గా వస్తుంది. ఇందులో నా లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్స్ జరుగుతున్నాయి `` అన్నారు.
దర్శకుడు అశోక్.జి మాట్లాడుతూ గీతాంజలి` తర్వాత హీరోయిన్ అంజలి చేస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఇధి. అంజలిని ఈ సినిమా కోసం అంజలి 15`20 కిలో బరువు తగ్గింది. గ్లామర్‌రోల్ చేసింది. చాలా కష్టపడి నటించింది. యు.ఎస్‌లో నలభై రోజుల పాటు అంజలి చలిలో కష్టపడి నటించింది. యునైటెడ్ అమెరికాలో ఈ సినిమాను చిత్రీకరించాం. 90శాతం మూవీ అమెరికాలోనే జరుతుంది. మేకప్, కెమెరామెన్ సహా హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్‌చేశారు. తండ్రికొడుకు ఓ సినిమాకు సంగీతం అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అనుకుంటాను. స్వెగణేష్, స్వె స్వామినాథన్ మంచి మ్యూజిక్ అందించారు. నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో సినిమాను విడుద చేయడానికి ప్లాన్ చేస్తున్నాను`` అన్నారు.
నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ నిర్మాతగా నాకిది నాలుగో సినిమా. అంజలిగారు చాలా కమిట్‌మెంట్‌తో సినిమాలో వర్క్ చేశారు. ఈ మధ్య కాంలో ఇలాంటి జోనర్ మూవీ రాలేదు. కచ్చితంగా ప్రేక్షకును ఆకట్టుకునే మూవీ అవుతుంది`` అన్నారు.
స్వాతి దీక్షిత్, ప్రియ, సప్తగిరి, సాక్షి గులాటి, సుడిగాలి సుధీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఆర్ట్: వోల్గా, అల్లా శ్రీను, స్టంట్: స్మాన్ రాజు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, లిరిక్స్: శ్రీమణి, బాలాజీ, సంగీతం: స్వె గణేష్, స్వె స్వామినాథన్, కెమెరా: జేమ్స్ క్వాన్, హామీద్ రోడిన్, బాల్ రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, కథ,మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్.జి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments