కెరీర్ ప్రారంభంలో విజయాలను అందుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు మెగా క్యాంప్ హీరోల్లో ఒకరైనా సాయిధరమ్ తేజ్. అయితే.. సరైన కథలను ఎంచుకోకపోవడంతో సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలను చవిచూశాయి. దీంతో తేజ్‌కి ప్లాప్ హీరో అనే పేరును సంపాదించుకున్నాడు. తేజ్ కెరీర్ ఎటు వెళ్తుందో అనేది .. డైలమాలో పడింది. ఇలాంటి తరుణంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో తేజ్ చేసిన చిత్రమే `చిత్రలహరి`. తొలి చిత్రం `నేను శైలజ`తో విజయాన్ని సాధించిన దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో `ఉన్నది ఒకటే జిందగీ`చిత్రంతో పరాజయాన్ని మూట గట్టుకున్నాడు. డైరెక్టర్ కిశోర్‌కు కూడా హిట్ అవసరమైంది. ఇలా హిట్ అవసరం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన చిత్రమే `చిత్రలహరి`. మరి ఈ ఇద్దరికీ సక్సెస్ దక్కిందా? సాయిధరమ్ తేజ్ అనే పేరును కాస్త సాయి తేజ్ అని స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న హీరోకి స్క్రీన్ నేమ్ ఎంత కలిసి వచ్చింది? ఆరు ప్లాపులకు బ్రేక్ పడి.. సక్సెస్ సాధించాడా? లేదా? అని తెలుసుకోవాంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ:
విజయ్ కృష్ణ(సాయితేజ్) దురదృష్ట జాతకుడని భావిస్తుంటాడు. ఎందుకంటే తను చేసే ఏ పని తనకు కలిసిరాదు. యాక్సిడెంట్స్ జరిగిన వెంటనే వ్యక్తి ప్రాణాలు కాపాడేలా ఓ యాప్‌ను క్రియేట్ చేస్తాడు విజయ్. దాని స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. విజయ్‌కి గర్ల్‌ఫ్రెండ్ లహరి (కల్యాణి ప్రియదర్శన్)కి తాగుబోతులంటే పడదు. తాగుడు అలవాటున్న విజయ్, లహరికి తనకి తాగుడు అలవాటు లేదని చెబుతాడు. . అయితే లహరి స్నేహితురాలు స్వేచ్ఛ విజయ్ అబద్దాలాడుతున్నాడని చెబుతుంది. అందుకు కారణంతండ్రి, తన తల్లికి చేసిన అన్యాయానికి చ్ఛకు మగాళ్లంటే సదభిప్రాయం ఉండదు. అందుకు తగినట్లు అబద్ధమాడిన విజయ్ బార్‌లో మందు తాగుతూ లహరికి అడ్డంగా దొరికిపోతాడు. అలా కొన్ని సంర్భాలతో విజయ్, లహరి మధ్య దూరం పెరిగి బ్రేకప్ అవుతుంది. ఈలోపు విజయ్ ప్రాజెక్ట్ ఫైల్ స్వేచ్ఛ కారణంగా ముందుకెళుతుంది. కంపెనీ వాళ్లు ముంబైకి రమ్మంటారు. స్వేచ్ఛతో కలిసి విజయ్ ముంబై వెళతాడు. అయితే అక్కడున్న మరో డైరెక్టర్ (బ్రహ్మాజీ) కారణంగా ప్రాజెక్ట్ మళ్లీ హోల్డ్‌లో పడుతుంది. ఒక పక్క ప్రేమలో ఓడిపోవడం.. ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోవడం వంటి కారణాలతో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? చివరకు లహరికి విజయ్ ప్రేమ అర్థమవుతుందా? వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా? విజయ్ ప్రాజెక్ట్ ఏమౌతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- ఇన్‌స్పిరేషనల్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా
- సంగీతం, నేపథ్య సంగీతం
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సినిమా డైలాగ్స్‌లోని ఎమోషన్స్ సన్నివేశాల్లో లేవు
- సినిమాలో హీరో దురదృష్టవంతుడనని చెబుతూ ఉంటాడు. కానీ అసలు ఓ హీరో అంతా చెప్పుకోవడానికి కారణమేంటనేది సినిమాలో కనపడదు. కేవలం మాటల్లోనే వినపడుతుంది.
సమీక్ష:
సాయిధరమ్ తేజ్ లుక్ విషయంలో కొత్తగా గడ్డం పెంచుకుని, కాస్త లావుగా కనపడ్డాడు. అలాగే పెర్ఫామెన్స్ పరంగా తన గత చిత్రాల కంటే ఈ సినిమాలో బాగానే చేశాడు. సినిమా అంతా ప్రధానంగా విజయ్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రకు సాయిధరమ్ న్యాయం చేశాడు. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర కల్యాణి ప్రియదర్శిని.. లవర్ ఆఫ్ విజయ్‌గా ఈమె ఓ పాటకు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. ఈమెతో లవ్ సీన్స్ గొప్పగా ఏం ఉండవు. ఇక నివేదా థామస్ పాత్ర కూడా ఏదో బరువు మోస్తున్నట్లు కనపడుతుంది కానీ.. అందుకు కారణాలు తెరపై ఎక్కడా కనపడదు. అలాగే సాయిధరమ్ స్నేహితుడిగా నటించిన సునీల్ పాత్ర ఫస్టాఫ్‌లో బాగానే నవ్వించింది. తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి తనదైన రీతిలో పరకాయ ప్రవేశం చేశాడు. వెన్నెలకిషోర్ సెకండాఫ్ అంతటినీ చక్కగా క్యారీ చేశాడు. తమిళియన్‌గా తన కామెడీ ఆడియెన్స్‌ని నవ్విస్తుంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రలకు పెద్ద ప్రాముఖ్యత కనపడదు. పాత్రల పరిధి మేర బ్రహ్మాజీ, భరత్ రెడ్డి తదితరులు చక్కగా నటించారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు కిశోర్ తిరుమల ప్రయత్నాన్ని మించిన గెలుపు లేదు.. అనే పాయింట్‌ను చెప్పేలా కథను రాసుకన్నాడు. బేసిక్‌గా తను మంచి రైటర్ కాబట్టి సన్నివేశాలను డైలాగ్స్ బలంగా కనపడేలా చూపించాడు. అయితే తను చెప్పాలనుకున్న ఎమోషన్స్ ఏవీ సన్నివేశాల్లో కనపడవు. ఉదాహరణకు హీరో తాను దురదృష్టవంతుడిని అని చెప్పుకునేంత బాధాకరమైన సన్నివేశాలు మనకు ఎక్కడా కనపడవు. ఫస్టాఫ్‌లో సునీల్ కామెడీ కంటే.. కూడా వెన్నెలకిషోర్ కామెడీ సన్నివేశాలే బావున్నాయి. అలాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా డెప్త్ కనపడదు. సినిమాలో ఆడియెన్స్‌ని సన్నివేశాలకు కనెక్ట్ చేసేది సంభాషణలు మాత్రమే. పోసాని చేత సన్నివేశాలకనుగుణంగా చెప్పే డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. దేవిశ్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బావుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: చిత్రలహరి.. ఓసారి చూడదగ్గ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్ తరహా చిత్రం
Comments