'చిరునవ్వుతో' 15 ఏళ్లు

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

2000కి గానూ 'ఉత్త‌మ చిత్రం'గా నంది పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న సినిమా 'చిరున‌వ్వుతో'. వేణు, షాహిన్ జంటగా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, ప్రేమ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జి.రామ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రాసిన మాట‌లు ప్రాణ‌వాయువులా నిలిచాయి. ఆల్ మోస్ట్ అన్ని డైలాగులు అండ‌ర్‌లైన్ చేసుకుని మ‌రీ డైరీలో రాసుకోద‌గ్గ విధంగా ఉంటాయి. ఇందులోని డైలాగ్‌ల‌తో పాటు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అందించిన పాట‌లు కూడా ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'సంతోషం స‌గం బ‌లం హాయిగా న‌వ్వ‌మ్మా..' పాట సినిమా థీమ్‌కి త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. న‌వంబ‌ర్ 10, 2000న విడుద‌లైన 'చిరున‌వ్వుతో'.. నేటితో 15 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.