నిన్న శ్రీమంతుడు..రేపు మురుగుదాస్ మూవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే శ్రీమంతుడు కథను కొరటాల ముందుగా రామ్ చరణ్ కి చెప్పడం..చరణ్ తో కొరటాల సినిమా ప్రారంభించడం కూడా జరిగింది. అయితే కథ విషయంలో చిరు కొన్ని మార్పులు చెప్పారట. ఎంటన్ టైన్మెంట్ లేకుండా ఇలాంటి కథను జనం చూడరని అందుచేత ఎంటర్ టైన్మెంట్ పెంచాలని...చెప్పడంతో కథలో మార్పులు చేయడం ఇష్టం లేక కొరటాల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
ఆ కథనే మహేష్ కి చెప్పడం..మహేష్ కథ విషయంలో ఎలాంటి మార్పులు చెప్పకపోవడం... శ్రీమంతుడు సంచలన విజయం సాధించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే...మహేష్..మురుగుదాస్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కథ న్యాయ వ్యవస్థ పై పోరాటం చేసేలా ఉంటుందట. ఈ కథను మురుగుదాస్ ముందుగా చిరుకి చెప్పారట. చిరు నో చెప్పడంతో మురుగుదాస్ మహేష్ కి చెప్పడం...మహేష్ ఎస్ చెప్పడం జరిగిందని టాక్. ఇదే కనుక నిజమైతే శ్రీమంతుడు విషయంలోను అలాగే జరిగింది. మరి ఈ మూవీ విషయంలో కూడా అలాగే జరుగుతంది. సో..మహేష్..మురుగుదాస్ మూవీ మరో శ్రీమంతుడు అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com