ఖైదీగా చిరు నెంబర్ నాడు 786..నేడు..?

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం చిరంజీవి జైలులో ఉండే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చంచ‌ల్ గూడ జైలులో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. చిరంజీవి జైలు నుంచి త‌ప్పించుకునే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని స‌మాచారం. అయితే...ఖైదీ గెట‌ప్ లో చిరు వేసుకున్న చొక్కా పై 150 నెంబ‌ర్ ఉంది. చిరంజీవి 150వ సినిమా కాబ‌ట్టి ఖైదీ నెంబ‌ర్ 150 కేటాయించి ఉండ‌చ్చు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.