కేరళ సి.ఎం తో చిరు,నాగ్,సచిన్ మంతనాలు..
- IndiaGlitz, [Wednesday,June 01 2016]
ఈరోజు ఉదయం తిరుపతిలో శ్రీనివాసుడిని చిరంజీవి, నాగార్జున, సచిన్ టెండూల్కర్, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ దర్శించుకున్నారు. క్రికెట్, సినీ, వ్యాపార దిగ్గజాలుగా ఎదిగిన వీరి సంయుక్త నేతృత్వంలో సరికొత్త ప్రాజెక్టు రూపకల్పన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కలయికకు కారణం ఏమిటి అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం చిరంజీవి, నాగార్జున, సచిన్, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ తిరువనంతపురం వెళ్లి కేరళ సి.ఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు.
ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు పై కేరళ ముఖ్యమంత్రితో చర్చించినట్టు సమాచారం. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కేరళ బ్లాస్టర్స్ కు సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పై నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ...మేము(చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్) సచిన్ కేరళ బ్లాస్టర్స్ తో కలవడం చాలా ఎక్సైటైడ్ గా ఫీలవుతున్నాం అంటూ సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ఎల్లో డ్రెస్ లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసారు.ఈ విషయం పై సుమంత్, అల్లు శిరీష్ ట్విట్టర్ లో ...సచిన్ తో కలిసి కేరళ బ్లాస్టర్స్ కో ఓనర్ గా వ్యవహరిస్తుండడం గర్వంగా ఉంది అని స్పందించారు.