తిరుమలలో నాగ్, చిరు, సచిన్..

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

భార‌త క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్, తెలుగు సినీ దిగ్గ‌జాలు చిరంజీవి, నాగార్జున‌, సినీ వ్యాపార ప్ర‌ముఖులు అల్లు అర‌వింద్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ నిన్న తిరుమ‌ల వ‌చ్చారు. వీరికి రాత్రి 8 గంట‌ల‌ స‌మ‌యంలో తిరుమ‌ల‌లోని శ్రీకృష్ణ అతిథిగృహం వ‌ద్ద టీటీడీ రిసెప్ష‌న్ డిప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్ పుష్ప‌గుచ్చంతో స్వాగ‌తం ప‌లికారు. స‌చిన్ టెండూల్క‌ర్ మాత్రం స‌తీమ‌ణి అంజ‌లితో క‌లిసి వ‌చ్చారు.
వీరు తిరుమ‌ల‌కు రావ‌డానికి కార‌ణం ఏమిటి అనేది తెలియ‌లేదు. అయితే...క్రికెట్, సినీ, వ్యాపార దిగ్గ‌జాలుగా ఎదిగిన వీరి సంయుక్త నేతృత్వంలో స‌రికొత్త ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో భాగంగానే శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆశీస్సులు అందుకునేందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వీరంద‌రూ ప్ర‌త్యేక విమానంలో తిరుప‌తి విమానాశ్ర‌యానికి చేరుకుని, అక్క‌డి నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అర‌గంట త‌ర్వాత అతిథి గృహంలోనే వీరంద‌రూ గ్రూప్ ఫోటో దిగి సంద‌డి చేసారు. ఈరోజు (బుధ‌వారం) ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకుని అనంత‌రం అదే విమానంలో తిరిగి ప్ర‌యాణ‌మ‌వుతారు.

More News

క‌ళ్యాణ్ రామ్ న్యూలుక్ అదిరింది..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

'బిచ్చగాడు' సక్సెస్ మీట్

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిఖల్, వి.ఐ.ఆనంద్ , మేఘన ఆర్ట్స్ కాంబినేషన్ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'

స్వామిరారా,కార్తికేయ,సూర్య vs సూర్య లాంటి వైవిధ్యమైన కథాంశాల తో సరికొత్త కథనాలతో వరుస సూపర్హిట్ చిత్రాలతో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎనర్జిటిక్ హీరో నిఖిల్,

స‌మంత పెళ్లి గురించి మ‌రో వార్త‌

అందాల బొమ్మ స‌మంత త్వ‌ర‌లో టాలీవుడ్ యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ఓ ఇంట‌ర్ వ్యూ లో చెప్పిన విష‌యం తెలిసిందే. స‌మంత ఇలా చెప్పిందో లేదో...అలా టాలీవుడ్, కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత పెళ్లి వార్త హాట్ టాపిక్ అయ్యింది.

శ్రీనివాసుడిని ద‌ర్శించుకున్న నితిన్..

యువ హీరో నితిన్ - స‌మంత జంట‌గా తెర‌కెక్కిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.