పాపం...వినాయక్..
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్..అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ..అఖిల్ మూవీ రూపొందించాడు. కానీ ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూసిన వారందరూ అఖిల్ సక్సెస్ అయ్యాడు...అఖిల్ మూవీ ప్లాప్ అయ్యింది అంటున్నారు. అక్కినేని అభిమానులు...ఇండస్ట్రీ వర్గాలు...అందరూ డైరెక్టర్ వినాయక్ దే తప్పు అంటున్నారు.
దీంతో ఫెయిల్యూర్ ని తట్టుకోలేని వినాయక్ బాగా అప్ సెట్ అయ్యాడట. అఖిల్ మూవీ హిట్ అయితే నెక్ట్స్ చిరంజీవి 150వ సినిమా చేయాలనుకున్నారు. కానీ అఖిల్ మూవీ ప్లాప్ అవ్వడంతో వినాయక్ 2 లేక 3 నెలల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడట. దీంతో జనవరి నుంచి వినాయక్ దర్శకత్వంలో 150వ సినిమా చేద్దామనుకున్న చిరు ఆలోచనలో పడ్డాడట. మరి...వినాయక్ కోసం 3 నెలల చిరు వెయిట్ చేస్తాడో...లేక వేరే డైరెక్టర్ తో స్టార్ట్ చేస్తాడో. నాగ్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశం ఇలా అవ్వడంతో వినాయక్ చాలా ఫీలవుతున్నాడట. పాపం వినాయక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com