చిరు లేడీ ఫ్యాన్‌కు హార్ట్ సర్జరీ సక్సెస్.. ధన్యవాదాలు
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ’ అధ్యక్షురాలు, చిరు వీరాభిమాని కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌కు రప్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ & ఎండీ, ఫేమస్ హార్ట్ సర్జన్ డా. గోపీచంద్ ఆధ్వర్యంలో నాగలక్ష్మికి చికిత్స జరిగింది. సుమార్ 3:30 నిమిషాల పాటు శ్రమించిన వైద్య బృందం ఆమెను శస్త్ర చికిత్స చేసింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చిరు అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మీడియాకు వెల్లడించారు. అందరి ప్రార్థనలు ఫలించాయని.. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సర్జరీ జరిగిందన్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు..
‘ఆపరేషన్ పూర్తవ్వగానే స్వామి నాయుడికి ఫోన్ వచ్చింది. ఆయన్నుంచి నాకు ఫోన్ వచ్చింది. డాక్టర్ గోపీచంద్ గారికి, వాళ్ల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ విషయాన్ని సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడు.. హైదరాబాద్ వరకూ రావటానికి ఏర్పాట్లు చేసిన దిలీప్, ఇంత దూరం ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకి, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని మెగాస్టార్ తెలిపారు.
Rajanala Nagalaxmi garu R/o Guntur a fan from long time had heart problem.3 of her heart valves were closed and.Dr.Gopichand performed highly critical 3 1/2 hr surgery & saved her. My deep gratitude to #LifeSaver #DrGopichand of #StarHospitals. #TrueAngels pic.twitter.com/RJ83tfV5pC
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com