చిరు లేడీ ఫ్యాన్‌కు హార్ట్ సర్జరీ సక్సెస్.. ధన్యవాదాలు

గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ’ అధ్యక్షురాలు, చిరు వీరాభిమాని కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌కు రప్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ స్టార్‌ హాస్పిటల్స్‌ చైర్మన్ & ఎండీ, ఫేమస్ హార్ట్‌ సర్జన్ డా. గోపీచంద్ ఆధ్వర్యంలో నాగలక్ష్మికి చికిత్స జరిగింది. సుమార్ 3:30 నిమిషాల పాటు శ్రమించిన వైద్య బృందం ఆమెను శస్త్ర చికిత్స చేసింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చిరు అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మీడియాకు వెల్లడించారు. అందరి ప్రార్థనలు ఫలించాయని.. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సర్జరీ జరిగిందన్నారు.

ప్రత్యేక ధన్యవాదాలు..

‘ఆపరేషన్ పూర్తవ్వగానే స్వామి నాయుడికి ఫోన్ వచ్చింది. ఆయన్నుంచి నాకు ఫోన్ వచ్చింది. డాక్టర్ గోపీచంద్ గారికి, వాళ్ల బృందానికి ధ‌న్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడు.. హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన దిలీప్, ఇంత దూరం ప్రయాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి, ఇత‌ర సిబ్బందికి ప్రత్యేకంగా ధ‌న్యవాదాలు తెలుపుతున్నాను’ అని మెగాస్టార్ తెలిపారు.

More News

చైనాలో కరోనా వ్యాప్తి కట్టడికి రంగంలోకి రోబోలు!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మమమ్మారి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే 200 పైచిలుకు దేశాలు దాటేసిన ఈ వైరస్‌తో ఇటలీ, స్పెయిన్,

చేతులెత్తి దండం పెడుతున్నా.. భారత్ సాయం కావాలి!

కరోనా మహమ్మారితో మన దాయాది దేశం పాకిస్థాన్ విలవిలలాడుతోంది. మొత్తం సుమారు 5వేలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 77 మంది మృతి చెందారు.

ఇండియాపై న్యూయార్క్ స్వాతి వీడియో.. నెట్టింట్లో వైరల్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

మరో 2వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రధాని అంగీకారం!?

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్-14తో లాక్‌డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

‘రెడ్‌’ రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్‌

కోవిడ్ 19 దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే కుదేల‌వుతుంది. భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డింది. ప‌లు రంగాలు కుంటుప‌డ్డాయి.