రక్త దానం చేసిన మెగా తమ్ముళ్ళను సన్మానించిన చిరంజీవి, రామ్ చరణ్

  • IndiaGlitz, [Sunday,April 03 2016]
రామ్ చరణ్ 31వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మార్చి 27న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలోనూ, ప్రపంచంలోను నిర్వహించిన మెగా రక్త శిబిరాల ద్వారా 76,000 యూనిట్లను సేకరించిన సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఈరోజు అభిమానులను, ఆర్గనైజర్లను ప్రత్యేకంగా కలుసుకొని అభినందించారు, సన్మానించారు. తాజ్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి మెగా ఫ్యాన్స్, ఆర్గనైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరాల్లో పాల్గొన్న వారి అనుభవాలను, అనుబూతులను చిరంజీవి గారితో ఆత్మీయంగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా...
రామ్ చరణ్ మాట్లాడుతూ, తనకు 31వ జన్మదినం చిరకాలం గుర్తుండిపోయే కానుకగా అభిమానులు స్వచ్చందంగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాములో పాల్గొని విజయవంతం చేసారని చెప్పారు.
చిరంజీవి గారు మాట్లాడుతూ, స్వల్ప వ్యవధిలో ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించడం ఊహాతీతం. ఇంతటి మహత్ కార్యంలో పాలు పంచుకున్న అభిమానులకు నా ధన్యవాదాలు. రక్తం దొరక్క ఏ ఒక్కరు చనిపోకూడదన్న నా ఆశయాన్ని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్యాన్స్ ముందుండి నడిపించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఇదే సందర్భంగా సిబీబీ డోనార్ యాప్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా రక్త దాతల వివరాలను, బ్లడ్ బ్యాంకు వివరాలను, రక్తం దానం చేయాలనుకునే ఔత్సాహికుల సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇదే ఈవెంటులో మెగా ఫ్యాన్స్ ముఖ్య నేతలను, గ్లోబల్ మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంట్ నిర్వహించిన వారికి బహుబతులు అందజేశారు.