Chiru, Maheshbbau:వెంకటేశ్ రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుకలో చిరు, మహేశ్ సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఆయన సినీ జీవితం గురించి తప్పితే వ్యక్తిగా జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పటికీ వెంకటేశ్‌కు ఎంత మంది పిల్లలు ఉన్నారనేది చాలా మందికి తెలియదంటే నమ్మశక్యం కాదు. అలాంటిది ఇప్పుడు వెంకటేశ్ కుటుంబానికి సంబంధించిన ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. ఆయన రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.
వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు..
విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేశ్ స్వగృహంలోనే నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. ఇక ఈ వేడుకకు తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నాగచైతన్య ఈ నిశ్చితార్థానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు, మహేశ్ ఈ వేడుకలో సందడి చేసినట్లు ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది.
దగ్గుబాటి కుటుంబంలో పెళ్లిబాజాలు..
వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. కుమార్తెల పేర్లు ఆశ్రిత, హయ వాహిని, భావన కాగా.. కుమారుడు పేరు అర్జున్. పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి 2019లో జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుక కూడా చాలా సింపుల్‌గా జరిపించారు వెంకీ మామ. ప్రస్తుతం ఈ జంట విదేశాల్లో ఉంటున్నారు. మరోవైపు వెంకటేశ్ సోదరుడు సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం కూడా డిసెంబర్‌లో జరగనుంది. దీంతో దగ్గుబాటి కుటుంబంలో వరుసగా పెళ్లిబాజాలు మోగనున్నాయి.
ఇక వెంకటేశ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తన 75వ చిత్రం ‘సైంధవ్’ సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com