గౌతమీపుత్ర శాతకర్ణికి మ్యూజిక్ అందించేది ఇతనే..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు క్రిష్ పెళ్లి కారణం బ్రేక్ పడిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే...ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే...దేవీశ్రీ వేరే చిత్రాల్లో బిజీగా ఉండడం, దీనికి తోడు ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం కాబట్టి రీ రికార్డింగ్ కి ఎక్కువ టైమ్ కావాల్సి ఉండడంతో దేవిశ్రీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
దేవిశ్రీ ఈ చిత్రం నుంచి తప్పుకున్నప్పటి నుంచి లయరాజా ఇళయరాజా, స్వరవాణి కీరవాణి.....ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం...ఈ భారీ చిత్రానికి కంచె చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments