మాస్ హీరో బాలయ్య, క్లాస్ డైరెక్టర్ క్రిష్ కలిసి చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి అందరికీ నచ్చుతుంది - చిరంతన్ భట్..!
- IndiaGlitz, [Saturday,December 31 2016]
కంచె సినిమాతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా పరిచయమై...తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్. తాజాగా నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం రూపొందింది. ఇటీవల రిలీజైన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియోకు విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన భట్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
మీ గురించి చెప్పండి..?
బాలీవుడ్ దర్శకనిర్మాత విజయ్ భట్ మా తాతగారు. ఆయన ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ప్రొడ్యూస్ చేసారు. మా నాన్న గారు గుజరాత్ లో కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసారు. నేను సినిమా ఫీల్డ్ లోకి వస్తాను అనుకోలేదు. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లోకి వెళతానేమో అనుకున్నాను. అనుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను.
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఎలా జరిగిందో చూసారు కదా..! బాలీవుడ్ లో ఆడియో ఫంక్షన్స్ ఇలా జరగవు కదా..! ఎలా ఫీలయ్యారు..?
నిజమే...బాలీవుడ్ లో అంత మంది సమక్షంలో అంత గ్రాండ్ గా జరగవు. ఎ.పి సి.ఎం చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ మినిష్టర్ వెంకయ్యనాయుడు గారు..ఫంక్షన్ కి రావడం...భారీగా ఆడియోన్స్ సమక్షంలో జరగడం అద్భుతంలా అనిపించింది.
ఈ మూవీలో మీకు బాగా కష్టంగా అనిపించిన పాట ఏది..?
సాహో సార్వభౌమ...అనే సాంగ్ కంపోజ్ చేయడం కష్టమనిపించింది.
తెలుగు భాష తెలియదు కదా..! మ్యూజిక్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఫీలయ్యారా..?
లిరిక్స్ అర్ధం చేసుకోవడం కష్టమనిపించింది. ఆ టైమ్ లో డైరెక్టర్ క్రిష్, రైటర్ సాయిమాధవ్ గారు బాగా హోల్ప్ చేసారు. త్వరలో తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నాను.
కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలకి సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన సాహిత్యం గురించి ఏం చెబుతారు..?
శాస్త్రి గారు జీనియస్. ఆయన గురించి అందరికీ తెలిసిందే. నా రెండు సినిమాలకు శాస్త్రి గారే లిరిక్స్ అందించడం చాలా సంతోషంగా ఉంది.
బాలీవుడ్ మూవీస్ కి కూడా మ్యూజిక్ అందించారు కదా..! బాలీవుడ్, టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా మీరు గమనించిన తేడా ఏమిటి..?
బాలీవుడ్ లో ఒక సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తుంటారు. అదే టాలీవుడ్ లో అయితే ఒక సినిమాకి సంబంధించి అన్ని పాటలు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు. అందువలన ఆ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ కి ఎక్కువ ఎటాచ్ మెంట్ ఉంటుంది.
మీకు ఏ తరహా పాటలు అంటే ఇష్టం..?
మెలోడి సాంగ్స్ అంటే బాగా ఇష్టం.
మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు..?
ఆర్.డి.బర్మన్, లక్ష్మికాంత్ ప్యారలాల్...ఇలా ఒకరిద్దరూ కాదు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు.
మీరు మ్యూజిక్ అందించిన కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు చిత్రాలకు క్రిషే డైరెక్టర్. ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
క్రిష్ ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటాడు. రికార్డింగ్ టైమ్ లో నాకు చాలా సపోర్ట్ చేసాడు. క్రిష్ తో వర్క్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తుంటాను.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు..?
బాలకృష్ణ గారు మాస్ హీరో, క్రిష్ క్లాస్ డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అందరికీ నచ్చుతుంది.సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది.