Chiranjeevi: బీజేపీ అభ్యర్థికి చిరంజీవి మద్దతు.. నేనున్నాను అంటూ భరోసా..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. కానీ రాజకీయాల్లో తన మద్దతు మాత్రం కొంతమందికి తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీకి రూ.5కోట్ల విరాళం ఇచ్చి పరోక్షంగా తన సపోర్ట్ అందించారు. ప్రస్తుతం బీజేపీ నేత సీఎం రమేష్‌కు మద్దతు తెలిపారు. అనకాపల్లి నుంచి ఎంపీగా బీజేపీ తరపున రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు కోసం ఆయనను కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయండి.. మీ వెంట నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు.
అంటే పరోక్షంగా తన మద్దతు టీడీపీ కూటమికే అని తెలిపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి భారీగా విరాళం ఇవ్వడం.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతు తెలియజేయడం వంటి పరిణామాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. అయితే చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని హస్తం పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటున్నారు.
ఇటీవల తన జీవితం ఇక సినిమాలకే అంకితం అంటూ స్పష్టంచేశారు. దీంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా.. ఎన్నికల బరిలో ఉన్న వారికి మాత్రం తన ఆశీస్సులుంటాయని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు తన మద్దతు ఉంటుందని, ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరారు. దీనిని బట్టి చూస్తే చిరు ఏ పార్టీకి మద్దుతుగా లేరని స్పష్టమవుతోంది. కానీ తన శ్రేయోభిలాషులు, సన్నిహితులు పోటీలో ఉంటే మాత్రం వారికి వ్యక్తిగతంగా తన ఆశీస్సులు ఇస్తున్నారు.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. 'బింబిసార'తో బ్లాక్‌బాస్టర్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట.. ఈ మూవీతోనూ మెగాస్టార్‌కు మరిచిపోలేని విజయం అందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout