close
Choose your channels

Mega156: మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

Tuesday, October 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ ట్రీట్ ఇచ్చారు. 156వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 'ఈసారి మెగా మాస్ యూనివర్స్‌ని దాటి' అంటూ ఓ వీడియో విడుదల చేసింది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

అరుదైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం..

ఈ వీడియోలో సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ''ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్ధిస్తూ సెలబ్రేషన్ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు దర్శకుడు’’ అని తెలిపారు. ఇక గేయ రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ "అరుదైన కథతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరిస్తాం" అని చెప్పారు.

మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

వెనక్కి వెళ్లిన కల్యాణ్ కృష్ణ మూవీ..

అయితే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గత ఆగస్టు 22న చిరంజీవి 156, 157 సినిమాలను ప్రకటించారు. అందులో ఒకటి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహిరంచనున్న సినిమా. మరొకటి వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమా. కానీ కల్యాణ్ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందనే వార్తలు వస్తున్నాయి. 'భోళా శంకర్' డిజాస్టర్ కావడంతో ముందుగా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా సోషియో ఫాంటసీ మూవీలో నటించడమే బెటర్ అని ఈ మూవీని ముందుగా మొదలుపెట్టారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment