Mega156: మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ ట్రీట్ ఇచ్చారు. 156వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 'ఈసారి మెగా మాస్ యూనివర్స్‌ని దాటి' అంటూ ఓ వీడియో విడుదల చేసింది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

అరుదైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం..

ఈ వీడియోలో సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ''ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్ధిస్తూ సెలబ్రేషన్ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు దర్శకుడు’’ అని తెలిపారు. ఇక గేయ రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ అరుదైన కథతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరిస్తాం అని చెప్పారు.

వెనక్కి వెళ్లిన కల్యాణ్ కృష్ణ మూవీ..

అయితే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గత ఆగస్టు 22న చిరంజీవి 156, 157 సినిమాలను ప్రకటించారు. అందులో ఒకటి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహిరంచనున్న సినిమా. మరొకటి వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమా. కానీ కల్యాణ్ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందనే వార్తలు వస్తున్నాయి. 'భోళా శంకర్' డిజాస్టర్ కావడంతో ముందుగా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా సోషియో ఫాంటసీ మూవీలో నటించడమే బెటర్ అని ఈ మూవీని ముందుగా మొదలుపెట్టారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.

More News

Mallareddy: గత స్మృతులు గుర్తుచేసుకుంటూ 40ఏళ్ల నాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Jaggareddy: నేనే సీఎం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి..

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో పరామర్శ యాత్రకు రంగంలోకి దిగిన నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయ రణరంగంలో అడుగుపెట్టారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లోకి వచ్చారు.

Ram Charan-Upasana: సంప్రదాయానికి పెద్ద పీట.. స్త్రీ శక్తికి వందనం, వారితో కలిసి దసరా వేడుకల్లో చరణ్ దంపతులు

పెద్దింట్లో పుట్టినా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా రామ్ చరణ్ తన మూలాలను మరిచిపోలేదు. మోడ్రన్‌గా కనిపిస్తూనే, సాంప్రదాయాలకు సైతం విలువనిస్తారు చెర్రీ. అంతేకాదు..

Bigg Boss Telugu 7: మరోసారి టార్గెట్ అయిన భోలే.. పెద్దన్నయ్యలా శివాజీ, హీటెక్కించిన నామినేషన్స్

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం పూజా మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వరుసగా ఏడుగురు అమ్మాయిలు