చిరూ.. ‘పునాదిరాళ్ల’కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని పట్టించుకోరూ..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు కొణిదెల చిరంజీవి. ఈయన ఇప్పటి వరకూ 151 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ.. కేరీర్ ప్రారంభం మాత్రం ‘పునాదిరాళ్లు’. చిరును ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి గూడపాటి రాజ్‌కుమార్. అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అంతేకాదు ఎవరు సాయం చేస్తారా..? అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. పాపం ఈ ‘పునాదిరాళ్లు’ కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని తనకు హిట్టిచ్చి కెరీర్‌ను నిలబెట్టిన మెగాస్టార్ చిరంజీవి అయినా పట్టించుకోక పోతారా..? అని ఆయన ఎదురుచూపులు చూస్తున్నారు.
జీవితంలో అన్నీ విషాదాలే..!
గూడపాటి రాజ్‌కుమార్.. చిరుతో తెరెక్కించిన ‘పునాదిరాళ్లు’ చిత్రానికి ఒకట్రెండు కాదు ఏకంగా 5 నంది అవార్డులు దక్కించుకున్నారు. ఈయన తెరకెక్కించింది.. నిర్మించింది కొన్ని చిత్రాలే అయినా.. అన్ని సామాజిక ఇతివత్తాలన్న చిత్రాలే.. అయితే ఈయన పరిస్థితి ఆర్థికంగా చాలా అద్వాన్నంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే కుటుంబంలో వరుస విషాదాలు మరింత కుంగదీశాయి. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో.. సతీమణి కూడా కాలం చేయడంతో ఆయన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం రాజ్‌కుమార్ తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అంతేకాదు.. ఇప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదంటే పరిస్థితి అర్థం చేస్కోవచ్చు.
ఎదురుచూపులు!
తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ రాజ్‌కుమార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. కనీసం మందులకు కూడా డబ్బుల్లేని ధీనపరిస్థితిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి లాంటి పెద్దలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి సాయం చేస్తే బాగుంటుందని సినీ ప్రియులు, మెగాభిమానులు కోరుతున్నారు. మరి చిరూ పెద్ద మనసు చేసుకుని రాజ్‌కుమార్‌కు సాయం చేసి ఆదుకుంటారో..? లేకుంటే మనకెందుకులే అని మిన్నకుండిపోతారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com