చిరంజీవి కూతురు తల్లి కాబోతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కు ఆమె స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ తోవివాహం జరిగిన విషయం తెలిసిందే. అతిరథ మహారథుల మధ్య ఈ పెళ్లి 2016 మార్చ్ 28న బెంగుళూరు లోనే మెగాస్టార్ ఫామ్ హౌస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవలే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రంతో హీరోగా ఎంట్రీ కూడా ఇచ్చాడు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.
అయితే తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తల్లి కాబోతోందన్న శుభవార్తని కళ్యాణ్ దేవ్ స్పష్టం చేశాడు. కళ్యాణ్ దేవ్, శ్రీజ లు నవ్వుతూ తన బేబీ బంప్ పై చేతులు పెట్టుకొని ఉన్న సెల్ఫీ ఫోటోని తీసి "శ్రీజకళ్యాణ్ బేబీ2 #లోడింగ్...." అంటూ శ్రీజ తల్లి కాబోతున్న విషయాన్నీ ఎంతో సంతోషంతో ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు.
మొదట ప్రేమ వివాహం చేసుకొని నివ్రితి అనే బిడ్డకు జన్మనిచ్చిన శ్రీజ ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దింతో మెగా స్టార్ ఇంట్లో దీపావళి పండగ ముందుగానే పండగ వాతావరణం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com