సంక్రాంతి బ‌రిలో ‘ఆచార్య‌’..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. నిజానికి ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌నుకుని మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ భావించార‌ట‌. అయితే క‌రోనా సినిమాపై పెద్ద ప్ర‌భావాన్నే చూపించింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌లెట్టినా చిరంజీవి పార్ట్ పూర్తి చేస్తారు. త‌ర్వాతచిరంజీవి, కాజ‌ల్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. త‌ర్వాత కీల‌క పాత్ర‌లో న‌టించే రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను చిత్రీక‌రించాల్సి ఉంది.

దీంతో అనుకున్నట్లు ఆగ‌స్ట్‌లో సినిమాను విడుద‌ల చేయలేం. పోనీ ఈ ఏడాది ద్వితీయార్థంలో అయినా చేద్దామంటే కెజియ‌ఫ్ 2, ప్ర‌భాస్ 20 ఇత‌ర సినిమాలు ఉంటాయ‌నుక‌న్నారు. కాబట్టే వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్ అయితేనే బెస్ట్ అని భావించార‌ట‌. కానీ లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆర్ఆర్ఆర్ సంక్రాంతి పోరు నుండి త‌ప్పుకుంద‌ని, కాబ‌ట్టి సంక్రాంతికి బాస్ రావాల‌నుకుంటున్నాడ‌ని. మ‌రి వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

‘ఆర్ఆర్ఆర్’ విడుద‌ల వాయిదా.. రాజ‌మౌళి టార్గెట్ అప్పుడే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో

బ‌న్నీ చిత్రంలో క‌న్న‌డ స్టార్ హీరో ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

కరోనాపై పోరుకు ఏపీలో ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌’...

కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌

కరోనా నేపథ్యంలోనూ విజయసాయి వర్సెస్ మెగా బ్రదర్

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు

కేటీఆర్ పంచ్‌కి నా ముక్కు వాచింది: ఆర్జీవీ

వివాద‌స్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడు ఏకైక స్నేహితుడు సోష‌ల్ మీడియానే. సాధార‌ణ స‌మ‌యాల్లోనే సోషల్ మీడియాను ప్ర‌ధాన ఆయుధంగా