ఆ ఇద్దరితో మరోసారి చిరు?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. తాజాగా ఆయన మరోసారి ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించనున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే అది కూడా ఆయన 151వ సినిమాలో నటిస్తున్న హీరోయిన్సే కావడం విశేషం. చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంటే, తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తుంది.
కాగా ఈ సినిమా తర్వాత చిరు, కొరటాల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా హీరోయిన్స్‌గా నయనతార, తమన్నా పేర్లే పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సైరా చిత్రీకరణ పూర్తి కాగానే చిరంజీవి కొరటాల శివ సినిమాలో పార్ట్ అవుతాడు. ఆలోపు చిత్రీకరణను స్టార్ట్ చేసి చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించే యోచనలో కొరటాల ఉన్నాడు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com