యువ ద‌ర్శ‌కుడితో చిరు?

  • IndiaGlitz, [Saturday,May 12 2018]

ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త‌దుస‌రి సినిమా గురించి ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వ‌ర‌కు చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ నేడు రూట్ మారింది. 'మహాన‌టి' ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌తో చిరంజీవి త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని టాక్ విన‌ప‌డుతుంది.

మ‌హాన‌టి సినిమాతో నాగ్ అశ్విన్ పేరు మారు మోగుతోంది. ఇది వ‌ర‌కే చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ టైమ్ మిష‌న్ బ్యాక్ డ్రాప్‌లో ఓక‌థ‌ను త‌యారు చేశాడ‌ట‌. దీనికి చిరంజీవి నుండి గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంది. ఈ సినిమాను అశ్వ‌నీద‌త్ నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. మ‌రి చిరు 152 సినిమా గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.