అందరికీ చేరువయ్యే టైటిల్ లో చిరంజీవి...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఖైదీ నంబర్ 150` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు చిరు తన 151వ సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తెలుగు గడ్డపై స్వాతంత్ర్య తొలి సమరమోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై సినిమా రూపొందనుందనే సంగతి అందరికీ తెలిసిందే.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నాయి. సినిమాను స్వాతంత్ర్యం వచ్చిన రోజు, ఆగస్ట్ 15న లాంచనంగా ప్రారంభిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ముందుగా సినిమాను చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న ప్రారంభిస్తారని వార్తలు వచ్చిన, తీయబోయే సినిమా స్వాతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర కావడంతో ఆగస్ట్ 15న చేయాలనుకున్నారట. కాగా ఈ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. కానీ టైటిల్ మారేలా కనపడుతుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ చేరువయ్యేలా ఒకేలా పెట్టాలనుకుంటున్నారట. అందుకోసమని `మహావీర` అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com