అతడే నా గౌరవం.. చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి, ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు ఆయనకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. గత శుక్రవారం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో చరణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి గారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెలకట్టలేని ఈ పుట్టినరోజు కానుకను ఎంతో బాధ్యతతో స్వీకరిస్తా’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
అటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తనయుడు చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో ఓ అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోంది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం. హ్యాపీ బర్త్ డే చరణ్ అంటూ చిరు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఓ అరుదైన చిత్రాన్ని మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. చరణ్ బాల్యంలో వున్నప్పుడు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన బుగ్గమీద చిరు వేలితో తడుముతున్న ఫొటోను షేర్ చేశారు. అలాగే ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా కూడా చరణ్ బుగ్గల్ని వేలితో నిమిరే ఫొటోనూ దానికి చిరు జత చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు, చరణ్ లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com