'మిస్టర్ ' మూవీ అన్నీ అందరినీ ఆకట్టుకునే సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
ముకుంద, కంచె, లోఫర్ వంటి డిఫరెంట్ చిత్రాల తర్వాత మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `మిస్టర్*. సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా....
వరుణ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తున్నాడు
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``నేను ఎప్పుడూ వరుణ్‌కు ఓ విషయం చెబుతుంటాను. నీ వెనుక మేమున్నాం, మా వెనుక అభిమాలున్నారు కదా, మా కేంటి అనుకుని ఈజీగా తీసుకోకుండా, వచ్చిన అవకాశాన్ని కష్టంతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాలాగా పనిచేయాలి. కష్టాన్ని నమ్ముకో అని. అలాగే వరుణ్ నిరంతరం కష్టపడుతున్నాడు. వరుణ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను చేస్తున్నాడు. తను అచితూచి, జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ముకుందలో విలేజ్ కుర్రాడిగా నటించాడు. తర్వాత కంచె అనే క్లాస్ మూవీ చేశాడు. నాకు ఎంతో ఇష్టమైన మూవీ. తర్వాత మదర్ సెంటిమెంట్ ఉన్న లోఫర్ అనే పక్కా మాస్ మూవీ చేశాడు. ఇప్పుడు మిస్టర్ సినిమా అందరినీ అలరించే సినిమా అవుతుంది. చిత్ర నిర్మాతలు బుజ్జి, మధులు ఇద్దరూ సినిమాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తులు. `మిస్టర్` వారికి మరో పెద్ద సక్సెస్ మూవీగా నిలుస్తుంది. శ్రీనువైట్ల, కామెడి టింజ్ ఉన్న డైరెక్టర్. నాతో `అందరివాడు` సినిమా చేశాడు. తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన బ్రూస్‌లీ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించాను. ఖైదీ నంబర్ 150 కంటే ముందు బ్రూస్‌లీ చిత్రంలో నన్ను నేను తెరపై చూసుకుని పరావాలేదు అనుకునేలా చేసిన దర్శకుడు శ్రీనువైట్ల. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. కమెడియన్స్‌కు కూడా స్టార్ స్టేటస్ ఇచ్చిన దర్శకుడు. ఢీ, రెడీ, దూకుడు చిత్రాలు శ్రీనుకు ఎంతో పెద్ద హిట్ చిత్రాలుగా నిలవడమే కాకుండా తన స్టామినాను ప్రూవ్ చేశాయి. కొద్ది గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తోన్న మిస్టర్‌తో తనెంటో ప్రూవ్ చేసుకుంటాడు. అందులో ఏ డౌట్ లేదు. మిక్కి జె.మేయర్ ఎంతో చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. తను క్లాస్ టచ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఈ మిస్టర్ సినిమాలో అన్నీ సాంగ్స్ బావున్నాయి. అలాగే కథను అందించిన గోపీమోహన్, డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానకు ప్రత్యేకమైన అభినందనలు. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ చాలా గ్లామర్‌గా కనపడ్డారు. వారికి కూడా నా అభినందనలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు`` అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేశారు
మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ - ``చాలా కాలం క్రితం వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అనుకున్న మాట ప్రకారం ఆయన వరుణ్‌తో `మిస్టర్` సినిమా చేశాడు. వరుణ్‌తేజ్‌తో సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల, నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, మధులకు థాంక్స్. మిక్కి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. మిస్టర్ సినిమాకు ఎంతో మంచి మ్యూజిక ఇచ్చారు. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
మిస్టర్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ``ప్రతి సినిమా ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నం చేస్తుంటాను. అభిమానులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. మిస్టర్ సినిమా డైరెక్టర్ శ్రీనువైట్లగారు నేను బావున్నానని నాన్నతో అన్నారు. నాన్న, ఆయనతో నన్ను డైరెక్ట్ చేయమని అంటే తప్పకుండా అని అప్పుడెప్పుడో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. మిస్టర్ సినిమా చాలా బాగా వచ్చింది. అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మిక్కిగారు నాకు మంచి మిత్రుడు. ముకుంద తర్వాత మిస్టర్‌తో మరోసారి మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే నిర్మాతలు బుజ్జి, మధుగారికి, లావణ్య, హెబ్బా పటేల్ సహా అందరికీ థాంక్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరిని పిలవాలనుకున్నప్పుడు నాకు డాడీ(చిరంజీవి)యే గుర్తుకు వచ్చారు. అడగ్గానే వస్తానన్నారు. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావడం మా అందరికీ ఎంతో బలాన్నిచ్చింది. అలాగే కళ్యాణ్ బాబాయ్‌కి, చరణ్ అన్న, బన్ని అందరూ బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఇక ఏప్రిల్ 14న రానున్న మిస్టర్ సినిమాతో మంచి సినిమా చేయాలని అందరూ కష్టపడి చేశాం. అందరినీ ఎంటైర్ చేస్తుందని నమ్ముతున్నాను`` అన్నారు.
`మిస్టర్`లో వరుణ్‌తేజ్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తారు
డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ - ``చిరంజీవిగారు గుర్తుకు రాగానే నాకు గుర్తుకు వచ్చేది ఖైదీ సినిమా. 34 ఏళ్లకు ముందు ఖైదీ సినిమాతో ఒక సంచలన క్రియేట్ చేస్తే, మళ్ళీ 34 ఏళ్ళ తర్వాత మరో ఖైదీతో మరో సంచలనం క్రియేట్ చేశారు. అందుకు కారణం ప్రేక్షకుల హృదయాల్లో జీవిత ఖైదీ. ఈ వేడుకకు ఆయన రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సక్సెస్ కోసం కాకుండా ప్రేక్షకుల ప్రేమ కోసం మిస్టర్ సినిమాను చేశాను. నిర్మాతలు బుజ్జి, మధులు ఎంతో సహకారం అందించారు. గోపీమోహన్ లైన్ చెప్పినప్పటి నుండి ట్రావెల్ అవుతున్నాం. శ్రీధర్ సీపాన మంచి డైలాగ్స్ అందించారు. మిక్కి అద్భుతమైన పాటలు అందించారు. అంతే కాకుండా ఓ సర్‌ప్రైజింగ్ రీరికార్డింగ్ కూడా చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్. ఎడిటర్ వర్మ, సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ సహా అందరికీ థాంక్స్. వరుణ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. జెన్యూన్ యాక్టర్. చాలా రియల్‌గా నటిస్తాడు. తనలో డిఫరెంట్ యాంగిల్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది`` అన్నారు.
అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్
మిక్కి జె.మేయర్ మాట్లాడుతూ - ``మిస్టర్ సినిమాకు శ్రీనువైట్లతో తొలిసారి పనిచేస్తున్నాను. వరుణ్‌తో నేను చేస్తున్న రెండో సినిమా. ఇలాంటి ఒక మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీనువైట్లగారికి థాంక్స్. శ్రీనువైట్లగారికి మిస్టర్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
చంద్రముఖి అనే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ - `` మిస్టర్‌లో చంద్రముఖి అనే క్యారెక్టర్ చేశాను. ఇప్పటి వరకు నేను చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. శ్రీనువైట్ల వంటి డైరెక్టర్‌తో పనిచేయడం కల నేరవేరినట్లయ్యింది. నా క్యారెక్టర్‌తో ఎంతో అందంగా డిజైన్ చేశారు. వరుణ్‌తో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. హెబ్బా నా బెస్ట్ కో హీరోయిన్. గుహన్‌గారు ఎంతో అందంగా చూపించారు మిక్కిగారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. నిర్మాతలు బుజ్జి, మధులు ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమా చేశారు. టీం అందరికీ అభినందనలు`` అన్నారు.
స్క్రిప్ట్ వినకుండా సినిమా ఒప్పుకున్నాను
హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ``కుమార్ 21 ఎఫ్ సినిమా తర్వాత శ్రీనువైట్లగారితో మిస్టర్ సినిమా అనగానే కనీసం స్క్రిప్ట్ కూడా వినకుండా ఓకే చేశాను. లైఫ్ చేంజింగ్ మూవీ అవుతుంది. నా కొత్త విషయాలు నేర్చుకున్నాను. వరుణ్ అందరికీ డ్రీమ్ హీరో. మిస్టర్ జర్నీని నా మెమరబుల్ చేశారు`` అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఈ సినిమా కథ గురించి నాతో వరుణ్ డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ. ట్రెండ్ సెట్ విజువల్స్‌తో సినిమా ఉంటుంది. మిక్కి అన్నీ టైప్ ఆఫ్ సాంగ్స్‌కు మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ కానుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ``వరుణ్‌తేజ్‌తో నేను ఫిదా సినిమాకు పనిచేస్తున్నాను. ఇక మిస్టర్ విషయానికి వస్తే విజువల్స్ చాలా బావున్నాయి. సినిమా రాకింగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీధర్ సీపాన, ప్రిన్స్, శ్రీనివాసరెడ్డి, సత్యంరాజేష్, గోపి మోహన్, బెనర్జీ, పృథ్వీ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout