‘‘ అమ్మా నిన్ను కలవలేకపోతున్నా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ , ఇట్లు నీ శంకర్ బాబు : చిరు ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారి చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆత్మీయులను కోల్పోవడంతో పాటు క్వారంటైన్‌లో వున్న వారి బాధ అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీనికి అతీతం కాదు. ఇప్పుడు ఇదే ఆవేదనను అనుభవిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొద్దిరోజుల కిందట ఆయన కోవిడ్ బారినపడిన సంతతి తెలిసిందే. దీని కారణంగా బయటి ప్రపంచానికి , కుటుంబసభ్యులకు దూరంగా వుండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే శనివారం చిరంజీవి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. క్వారంటైన్‌లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని చిరు విచారం వ్యక్తం చేశారు. శనివారం తన తల్లి పుట్టినరోజు పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా చిరంజీవి ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణి సురేఖతో కలిసి దిగిన ఓ ఫొటోని ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
‘‘అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు’’ అని చిరు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు.. అంజనా దేవికి పుట్టినరోజు శుభాంక్షలు తెలియజేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం యువ హీరో నితిన్ భార్య శాలిని సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. దురదృష్టవశాత్తూ అప్పుడే షాలిని బర్త్ డే వచ్చింది. అయినప్పటికీ ఆమె పుట్టినరోజు చేయాలని నితిన్ భావించారు. అంతే భార్య బర్త్ డేను విభిన్నంగా జరిపారు. బంగ్లాలోంచి షాలిని చూస్తుండగా ఆమె బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
''కోవిడ్‌కి అడ్డంకులున్నాయి.. కానీ ప్రేమకు అడ్డంకులు లేవు. హ్యాపీ బర్త్‌డే మై లవ్.. జీవితంలో మొదటిసారి నువ్వు నెగెటివ్ కావాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశారు నితిన్. ఇది చూసిన నితిన్ ఫ్యాన్స్.. షాలినికి బర్త్‌డే గ్రీటింగ్స్ చెబుతూనే.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూనే తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నితిన్ - షాలిని పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ జంట
అమ్మా !????
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు ????
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ ??
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com