'జయదేవ్ ' చిత్రం గంటా రవికి శుభారంభం అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడక హైదరాబాద్ లో జరిగింది. ఇదే కార్యక్రమంలో మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్‌బాబు, కె.రాఘవేంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, సి.కళ్యాణ్, పరుచూరి బ్రదర్స్, పివిపి ప్రసాద్, పెంబర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, బెల్లంకొండ సురేష్, ఎస్.వి.కృష్ణారెడ్డి, మహేష్‌రెడ్డి, దామోదర్ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కొడాలి వెంకటేశ్వరరావు, కె.ఆచ్చిరెడ్డి, బి.గోపాల్, కె.ఎస్.రామారావు, వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే గణేష్ బాబు, జెమిని కిరణ్, లగడపాటి శ్రీధర్, ఆదిశేషగిరిరావు, వజ్రా శ్రీనివాసరావు, కుమార్ చౌదరి, అశ్వనీదత్, మారుతి, యలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు, రఘురామకృష్ణంరాజు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే అనిత, కె.వి.రావు, చాముండి, లాలం భాస్కర్‌రావు, గోవింద్‌రావు, పల్లా శ్రీనివాసరావు, డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ, నిర్మాత కె.అశోక్ కుమార్, అవంతి శ్రీనివాస్, వేణుగోపాలాచారి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఆడియో సీడీలను కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు విడుదల చేయగా తొలి సీడీని కె.రాఘవేంద్రరావు అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``గంటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. నన్ను అన్నయ్య అని నోరారా ఆప్యాయంగా పిలిచే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి నటించిన తొలి సినిమా ఆడియో లాంఛ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. మా ఇద్దరి అనుబంధం రాజకీయంగా ప్రారంభమైనా, రాజకీయాలకు అతీతంగా, కుటుంబ పరమైన బంధం ఏర్పడింది. శ్రీనివాసరావు నా కుటుంబంలో ఓ సభ్యుడైయ్యాడు. నాకు నిజమైన ఆత్మీయుడు. శ్రీనివాసరావుకు సినిమాలంటే చాలా ఇష్టముండేదని నాకు అర్థమవుతుంది. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. తనకు తీరని కోరిక తన కొడుకుతో తీర్చుకున్నందుకు వారెంతో ఆనందంగా ఉన్నారని వారిని చూడగానే తెలుస్తుంది. రవిని చూస్తుంటే మనిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు. అశోక్ గోల్డెన్ హ్యాండ్ మీదుగా రవి లాంచ్ అవుతున్నాడు. జయంత్ పరాన్జీ దర్శకత్వంలో రవి సినిమా చేయడం అనేది తనకు శుభారంభం. ఇదే ఉత్సాహం రేపు థియేటర్స్‌లో కూడా కనపడుతుందనే నమ్మకం ఉంది. సాంగ్స్ బావున్నాయి. రవి చక్కగా కనపడుతున్నాడు.
సాధారణంగా ఎవరైనా డెబ్యూ మూవీగా లవ్ స్టోరీని చేయాలనుకుంటారు కానీ రవి తన పర్సనాలిటీకి తగినట్లు , టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా రావాలనుకోవడం తనకు గుడ్ స్టార్ట్ అని అర్థమవుతుంది. జయంత్‌లాంటి వెర్సటైల్ డైరెక్టర్ దగ్గర తన మొదటి సినిమా చేయడం తనకు ప్లస్ అవుతుంది. జయంత్ అన్ని రకాల సినిమాలను చక్కగా తెరకెక్కించగలడు. సినిమాకు విజయం తథ్యం. మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. జయంత్, రవికి, మాళవిక సహా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మాట్లాడుతూ - ``గంటా శ్రీనివాసరావు చాలా మంచి వ్యక్తి. తనను ఎప్పుడూ తమ్ముడు అని పిలుస్తుంటాను. గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవిని జయదేవ్ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవిలాగా నేను, నా మొదటి సినిమాలో లేను. నువ్వు యాక్టర్‌గా పనికొస్తావా అని అన్నారు. కానీ నేను సక్సెస్ అయ్యాను. ఆరోజు నేనున్నదానికంటే రవి ఈరోజు తొలి సినిమాలో అందంగా ఉన్నాడు. ప్రతి పాట అద్భుతంగా ఉంది. గుడిలో గంట లేనిదే ఏ పని కాదు. అలాగే రవి నెంబర్ వన్ హీరో కావాలి. ఒక్కొక్క మెట్టు ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``రవి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు`` అన్నారు.
జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ - ``గంటారవికి, మాళవికకు మీ హృదయ పూర్వక ఆశీస్సులు కావాలి`` అన్నారు.
చిత్ర నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ - ``గంటా శ్రీనివాసరావుగారు నాపై నమ్మకంతో గంటా రవిని నా చేతుల్లో పెట్టారు. ఆయన నమ్మకాన్ని కొంత వరకు రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. రవికి మంచి భవిష్యత్ ఉంది. తన కోసం ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ తర్వాత మా బ్యానర్‌లో చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా నేను, జయంత్ కలిసి చేస్తున్న సినిమా ఇది. మా బ్యానర్‌కు హ్యాట్రిక్ మూవీ అవుతుంది.
గంటా రవి మాట్లాడుతూ - ``చిరంజీవిగారు, మోహన్‌బాబు సహా ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. జవహర్ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. మణిశర్మగారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. జయంత్‌గారికి థాంక్స్`` అన్నారు.
అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ - ``రవి అమ్మగారి సంకల్పం గొప్పది కాబట్టే రవి హీరో అయ్యాడు. అన్ని రంగాల్లో రవి పెద్ద సక్సెస్ కావాలి`` అన్నారు.
ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ - ముందు గంటా రవికి కంగ్రాట్స్. మా వైజాగ్ నుండి కూడా ఒక హీరో వచ్చేశాడు. జయంత్, అశోక్ సహా యూనిట్‌కు అభనందనలు`` అని తెలిపారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``అందరి దీవెనలతో రవి ముందుకెళ్ళాలి. గంటా శ్రీనివాసరావు, చిరంజీవిగారికి, మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. కడుపులో నుండే వచ్చే కసిలాంటిది ఉంటే ఎవరైనా సినిమాల్లో సక్సెస్ సాధించవచ్చు. ఆ కసి రవిలో బాగా కనపడుతుంది. దానికి జయంత్, అశోక్ అనుభవం, సహకారం తోడైంది. రవికి గొప్ప భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నాను`` అన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ``గంటా శ్రీనివాసరావు ఎదైనా గంటా భజాయించి సాధించగలడు. తన కుమారుడు రవిని హీరోగా చేయాలనుకున్నాడు. అనుకున్నట్లే రవిని హీరో చేశాడు. తొలి సినిమా యాక్షన్ ఉంటే హీరో సక్సెస్ అవుతాడు. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కచ్చితంగా సినిమా హిట్ సాధిస్తుంది. రవి అందరూ గర్వించే హీరో అవుతాడని అశీర్వదిస్తాడని భావిస్తున్నాం`` అన్నారు.
పివిపి ప్రసాద్ మాట్లాడుతూ - ``గంటారవి, మాళవిక జంటగా చక్కగా ఉంది. గంటారవికి జయదేవ్ చిత్రం తెలుగు చిత్రసీమలో మంచి ఎంట్రీ కావాలి. అశోక్‌గారి ప్రొడక్షన్ వేల్యూస్ ఫాబులస్‌గా ఉన్నాయి. జయంత్‌కు ఈ సినిమా మరో సక్సెస్ అవుతుంది`` అన్నారు.
బండారు సత్యనారాయణ మాట్లాడుతూ - ``మా గంటాగారు పేరులోనే విజయం ఉంది. ఆయన బిజినెస్‌లో విజయం, రాజకీయాల్లో విజయం. ఇప్పుడు ఆయన తనయడు రవి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రవి నాకు అబ్బాయిలాంటోడు. సినిమా టైటిల్‌లోనే సక్సెస్ కనపడుతుంది. పాట బావుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది`` అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ``జయంత్‌గారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయనతో నేను లక్ష్మీ నరసింహా సినిమా చేశాను. ఈశ్వర్‌లో ప్రభాస్‌ను ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత అశోక్‌గారు ఇప్పుడు రవిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జయంత్‌గారు శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మీ నరసింహా రీమేక్‌లతో హిట్ కొట్టారు. తమిళంలో పెద్ద హిట్ అయిన సేతుపతిని ఇప్పుడు జయదేవ్‌గా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. గంటా రవి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``గంటా శ్రీనివాసరావుగారు పొలిటిక్స్‌లో హీరో అనడంలో సందేహం లేదు. ఆయన అబ్బాయి గంటా రవి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తన ఫిజిక్‌లోనే మాస్ లుక్ కనపడుతుంది. జయంత్ ఓ హీరోతో సినిమా చేస్తున్నాడనగానే కచ్చితంగా ఆ హీరో సక్సెస్‌పుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. అన్ని రకాలుగా సినిమా పెద్ద హిట్ కావడానికి అవకాశాలున్నాయి`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments