చిరు కోరిక ఇలా తీరుతుంది

  • IndiaGlitz, [Friday,September 18 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ బ్రూస్ లీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరు, చ‌ర‌ణ్ కాంబ‌నేష‌న్లో ఓ సాంగ్ ప్లాన్ చేసారు. ఈ సాంగ్ లో చిరు, చ‌ర‌ణ్ ల‌తో కాళు క‌దిపి స్టెప్స్ వేసే హీరోయిన్ ఇలియాన అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఇలియాన ప్లేస్ లో త‌మ‌న్నా వ‌చ్చింద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...చిరు, చ‌ర‌ణ్ ల‌తో క‌ల‌సి స్టెప్సే వేసే అరుదైన అవ‌కాశాన్ని త‌మ‌న్నా ద‌క్కించుకున్న‌ట్టే.

అయితే.. త‌మ‌న్నాని సెలెక్ట్ చేయ‌డం వెన‌క ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఉంది. అదేమిటంటే..ర‌చ్చ ఆడియో ఫంక్ష‌న్ లో చిరు మాట్లాడుతూ..ర‌చ్చ షూటింగ్ లో త‌మ‌న్నా డాన్స్ చూసాను. చాలా బాగా చేసింది. త‌మ‌న్నా డాన్స్ చూసిన వెంట‌నే నా 150వ సినిమాలో హీరోయిన్ గా త‌మ‌న్నా అయితే బాగుంటుంది అనిపించింది. మ‌రి త‌మ‌న్నా నాతో చేస్తుందో లేదో అన‌గానే..అక్క‌డే ఉన్న త‌మ‌న్నా వెంట‌నే ఓకె చెప్పింది. అలా స‌ర‌దాగా జ‌రిగిన సంభాష‌ణ నిజ‌మ‌వుతుంది. ఎలా అంటే ఒక ర‌కంగా ఇదే చిరు 150 వ సినిమా. చిరు కోరుకున్న‌ట్టే త‌మ‌న్నా చిరుతోక‌ల‌సి స్టెప్సే వేయ‌నుంది. ఆరోజు చిరు మ‌న‌సులో మాట‌ ఈరోజు నిజం కావ‌డం చూస్తుంటే భ‌లే విచిత్రంగా ఉంది క‌దూ.

More News

చరణ్ నెక్ట్స్ మూవీ ఇదేనా...?

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.దసరా కానుకగా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు..

'మయూరి' మూవీ రివ్యూ

హారర్ సినిమా అనగానే హీరోయిన్లు చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకోవడం,నలుగురు గ్యాంగ్ అడవుల్లోకి వెళ్ళడం,వారికి అక్కడ ఏదోకనిపించడం,వీరిని చంపడం అనేది ఫార్ములాగా మారింది.

నాగ్ , కార్తీ ల మూవీ టైటిల్

నాగార్జున, కార్తీ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీకి ఊపిరి అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసారు.

చ‌ర‌ణ్ ఐదేళ్ళుగా అడుగుతున్నా సినిమా చేయ‌ని డైరెక్ట‌ర్..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌... ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ డైరెక్ట‌ర్స్ ని నాతో సినిమా చేయ‌మ‌ని అడ‌గ‌లేద‌ట‌. కానీ ఐదేళ్ళుగా ఒకే ఒక డైరెక్ట‌ర్ ని నాతో సినిమా చేయ‌మ‌ని అడిగాడ‌ట‌.

సందీప్ కిష‌న్ హీరోగా ద్విభాషా చిత్రం

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఇటీవ‌ల టైగ‌ర్ చిత్రంతో అల‌రించిన సందీప్ కిష‌న్ హీరోగా తెలుగు, త‌మిళ్ లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతుంది.