ఇకపై చిరు సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే!?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాలకు రాం రాం చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడానికి సీనియర్, కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తన సినీ కెరీర్‌లో చాలా మంది కొత్త, యువ దర్శకులకు అవకాశమిచ్చిన మెగాస్టార్ త్వరలోనే మరో ముగ్గురు దర్శకులతో సినిమాలు చేయనున్నారు. తాజాగా.. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఫోన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను స్వయంగా మెగాస్టారే చెప్పారు. ‘ఆచార్య’ తాను నటించబోయే సినిమాలు యువ దర్శకులతోనే అని చెప్పడంతో మెగాభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇంతకీ చిరు ఏమన్నారు..!?
‘‘సాహో’ దర్శకుడు సుజిత్‌తో ‘లూసిఫర్’ చేసే ఆలోచన వుంది. బాబీ, మెహర్ రమేశ్‌లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నాను. హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ్‌లను కూడా ఇటీవలే మా ఇంట్లో కలిశాను.. మా మధ్య చర్చలు కూడా జరిగాయి. కొరటాల చిత్రం పూర్తయిన తర్వాత నా కొత్త ప్రాజెక్టు గురించి చెబుతాను. యువ దర్శకులతో పని చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్‌కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది. నాకు కూడా వాళ్లతో, వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది’ అని చిరు తన మనసులోని మాటలను బయటపెట్టేశారు.
మొత్తానికి చూస్తే కుర్ర దర్శకులను ఆదరించడానికి చిరు సిద్ధమయ్యారన్న మాట. యంగ్ డైరెక్టర్ ఇక లేటెందుకు మీ మీ బుర్రకు పనిపెట్టి కథలు రాసుకుని చిరు దగ్గరికెళ్లిపోండి.. అవకాశం ఇచ్చేస్తారంతే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments